తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు..?

భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. పూర్వీకులు అందరూ తమ తర్వాతి తరాలకు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన సాంప్రదాయాలను పురాణాల్లో లికించారు.

 Tholi Ekadasi, Indian Culture, Tholi Ekadasi Importnace, Ekadasi Vratham-TeluguStop.com

ప్రస్తుతం పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు, ముఖ్యంగా పండుగల విషయంలో ఎలాంటి నిష్ఠ దైవచింతన ఉంటే మోక్షం లభిస్తుంది అన్నది పురాణాల్లో చెప్పబడింది.

అయితే తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత తెలుగు ప్రజలందరూ మొదటి పండుగగా జరుపుకునే పండుగ తొలి ఏకాదశి.ఈ పండుగను తెలుగు ప్రజలందరూ ఎంతో నిష్టగా జరుపుకుంటారు, సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి, అందులో అధిక మాసంలో ఇరవైఆరు ఏకాదశులు వచ్చిన… మొదటిసారి వచ్చే ప్రధమైకాదశి మాత్రం ఎంతో స్పెషల్ గా ఉంటుంది.

తొలి ఏకాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది.ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల లభిస్తాయని విశ్వాసం.

సూర్యోదయం ముందే లేచి శుచిగా స్నానమాచరించి నిష్టనియమాలతో శ్రీహరిని పూజించాలి.కుంకుమ పుష్పాలతో అలంకరించాలి.

ఆ తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇవ్వాలి.అయితే ఏకాదశి రోజున ఈ వ్రతం ఆచరిస్తే కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడి కాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు.

మంచంపై పడుకోవడం కూడా చేయొద్దు అని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube