ఎన్టీఆర్ ని మూడు నెలలు ఇంటికే పరిమితం చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన గొప్ప నటుడిగా నందమూరి తారక రామారావు ఎంతలా గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రామారావు నటిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పట్లో నిర్మాతలు భావించేవారు.

 Thodu Dongalu Movie Effect On Sr Ntr , Thodu Dongalu, Sr Ntr, Gummadi, Tollywood-TeluguStop.com

అందుకనే నష్టాల్లో ఉన్న నిర్మాతలు సైతం రామారావుతో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు అని చెప్పాలి.కానీ సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఏ హీరో కెరియర్ లో అయినా సరే హిట్లు, ఫ్లాపులు అన్నవి సహజం.

అచ్చంగా ఇలాగే అన్నగారు నటించి ఫ్లాప్ అయిన సినిమాలలో తోడు దొంగలు సినిమా కూడా ఒకటి.ఇందులో తోడు దొంగలుగా అన్నగారితో పాటు గుమ్మడి కూడా నటించారు.

అప్పట్లో భారీ బడ్జెట్ పెట్టిన సినిమా ఇది.అయితే కొత్తగా వచ్చిన నిర్మాత కావడంతో వెనుక ముందు ఆలోచించకుండానే కాస్త ఎక్కువ ఖర్చు చేశారు.రామారావు నటించిన సినిమా హిట్టే అని అనుకున్నారు అందుకే బడ్జెట్ విషయంలో వెనకాడకుండా చేసారు.ఇలా ఉన్నది మొత్తం సినిమా పైన పెట్టేసారు.అయితే అప్పటికే ఎన్టీఆర్ నటించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇక తోడు దొంగలు సినిమాకు కూడా బిజినెస్ బాగానే జరిగింది.

Telugu Gummadi, Ntr, Sr Ntr, Thodu Dongalu, Tollywood, Yoga Nandh-Latest News -

కానీ థియేటర్లో మాత్రం అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి.ఆశించినంతగా ఆ సినిమా ఆడలేదు.అన్నగారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

కానీ నిర్మాత మాత్రం ఎంతో ఘటికుడుటఅన్నగారు కావాలనే ఈ సినిమాలో సరిగ్గా నటించలేదు.అందుకే ఈ సినిమా పెద్దగా ఆడలేదు అని ప్రచారం చేయడం మొదలు పెట్టాడట.

ఇక కొంతమంది ఇది నిజమేన అని నమ్మడానికి సినిమా చూసారు.చివరికి ఈ ఎఫెక్ట్ కారణంగా అన్నగారికి మూడు మాసాల పాటు ఎలాంటి ఆఫర్లు రాలేదు.

కానీ ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ అవకాశం అందిపుచ్చుకొని వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోయారుఎన్టీ రామారావు.ఈ విషయాన్ని గుమ్మడి తీపి జ్ఞాపకాలు చేదు గుర్తుల పుస్తకంలో రాశారు.

ఇలా సినిమా పరాజయాన్ని ఎన్టీఆర్ పై వేసి సదరు నిర్మాత బాగానే డబ్బు సంపాదించుకున్నాడు.కానీ ఇలా హీరోలే సినిమా హిట్టుకు కారణమని నమ్మి కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు కదా ఈ రోజుల్లో.

ఫ్లాప్ వస్తే కూడా హీరో తన భుజాల పైన మోయగలగాలి.అందుకే డబ్బు పెడుతున్న నిర్మాతలు గెలుపు గుర్రాల పైనే పెట్టాలి అనుకుంటారు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube