ఈ గుర్రం తెలివికి మీ మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం, పరిగెత్తమంటే ఇది చేసే పనేంటో చూడండి  

This Horse Not Want Do Work When Try To Ride He Acted As Dead-horse Not Want Do Work When Try To Ride,lazy,telugu Viral News Updates,viral In Social Media

ఒక సర్వే ప్రకారం మనుషుల్లో 65 శాతం మంది బద్దకస్తులు ఉన్నారట.చేయాల్సిన పనిని తర్వాత చేద్దాం అని కొందరు, కొందరు పని చేసే సమయంలో బద్దకంతో వదిలేస్తూ మరి కొందరు ఇలా బద్దకస్తులు ఉంటారు.మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా బద్దకంగా ఉంటాయి.బద్దకంగా ఉండే జంతువు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు దున్నపోతు.బద్దకస్తులను అంతా కూడా దున్నపోతు అంటూ పిలుస్తూ ఉంటారు.ఏ జంతువులు అయినా వర్షం వస్తున్న సమయంలో నీడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తాయి.

This Horse Not Want Do Work When Try To Ride He Acted As Dead-horse Not Want Do Work When Try To Ride,lazy,telugu Viral News Updates,viral In Social Media-This Horse Not Want Do Work When Try To Ride He Acted As Dead-Horse Lazy Telugu Viral News Updates In Social Media

కాని దున్నపోతులు మాత్రం ఆ ఏముందిలే వర్షంలో తడిస్తే పోయేది ఏముంది అనుకున్నట్లుగా అలాగే నిలబడతాయట.

This Horse Not Want Do Work When Try To Ride He Acted As Dead-horse Not Want Do Work When Try To Ride,lazy,telugu Viral News Updates,viral In Social Media-This Horse Not Want Do Work When Try To Ride He Acted As Dead-Horse Lazy Telugu Viral News Updates In Social Media

దున్నపోతులకే కాకుండా గుర్రాలకు కూడా బద్దకం ఉంటుందట.అంత స్పీడ్‌ గా ఉరికే గుర్రాలకు బద్దకం ఏంటా అంటూ ఆశ్చర్యపోతున్నారా.అన్ని గుర్రాలకు కాదు లేండి.కొన్ని గుర్రాలకు మాత్రమే బద్దకం ఉంటుంది.ఇప్పుడు నేను చెప్పబోతున్న గుర్రంకు బద్దక రత్న.బద్దక శ్రీ అనే బిరుదులు ఇవ్వొచ్చు.ఈ గుర్రంపై స్వారీ చేయాలనుకుంటే చాలు బద్దకంతో కింద పడిపోతుంది.కింద పడిపోవడమే కాకుండా చచ్చి పోయినట్లుగా నటిస్తూ ఆస్కార్‌ లెవల్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇస్తూ ఉంటుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రసిస్కో అనే వ్యక్తి చాలా కాలంగా జింగాంగ్‌ అనే గుర్రాన్ని పెంచుకుంటున్నాడు.ఈ గుర్రంపై ఎప్పుడు స్వారీ చేయాలని చూసినా కూడా కింద పడిపోతుంది.కావాలని కింద పడిపోయి చనిపోయినట్లుగా యాక్టింగ్‌ చేస్తుంది.బద్దకంతోనే ఇది ఇలా చేస్తుందని అందరికి ఈజీగానే అర్థం అవుతుంది.అప్పటి వరకు బాగానే తిరిగి యాక్టివ్‌గా ఉన్న గుర్రం ఒక్కసారిగా ఎందుకు కింద పడిందా అంటూ ప్రసిస్కో బాధపడుతున్న సమయంలో అది చనిపోయినట్లుగా యాక్టింగ్‌ చేస్తుంది.

అతడు కొద్ది దూరం వెళ్లి పోయిన తర్వాత ఆ జింగాంగ్‌ గుర్రం చటుక్కున లేచి మళ్లీ తిండి మొదలు పెడతుంది.రెండు మూడు సార్లు ఇలాగే చేసిన తర్వాత అతడికి అర్థం అయ్యింది.ఇది బద్దకంతో రైడ్‌కు రానంటుంది అంటూ క్లారిటీ వచ్చేసింది.దీన్ని మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.ఎంతో మంది రైడర్స్‌ను తీసుకు వచ్చాడు.కాని ఫలితం లేకుండా పోయింది.రైడ్‌ అనగారే ఇది ఆస్కార్‌ లెవల్‌లో నటించేస్తోంది.నాలుక బయట పెట్టి మరీ చనిపోయినట్లుగా నటించడంతో దీన్ని ఎవరు కూడా కొట్టడానికి ఆసక్తి చూపరు.

ఈ గుర్రం నాటకాలను అతడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌ అయ్యింది.ఆ గుర్రం చేస్తున్న జోక్‌ ను అంతా నవ్వుకుంటున్నారు.కాని గుర్రం ఓనర్‌ మాత్రం స్వారీ చేయని గుర్రంను ఎంత కాలం మేపాలని బాధపడుతున్నాడు.