వైరల్ వీడియో: నడిరోడ్డు పై ఈ యువతి వ్యాయమాలు మామూలుగా లేవుగా...!

గబ్బర్ సింగ్ సినిమాలోని మందు బాబులం మేము మందు బాబులంఅనే పాట మన అందరికి బాగా గుర్తు ఉండే ఉంటుంది కదా.ఇప్పుడు అదే విధంగా ఒక లేడీ.

 This Young Womans Exercises On The Sidewalk Are Not Normal-TeluguStop.com

మందు బేబిలం మేము మందు బేబిలం అంటూ ఒక మందు బేబీ రోడ్డు మీద వీరంగం సృష్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.మద్యానికి అలవాటు పడితే దానికి బానిసలుగా మారడం మనకు తెలిసిన విషయమే.

కానీ మితం లేకుండా తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం.ఇలా చాలమంది మద్యం తాగి యాక్సిడెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము.

 This Young Womans Exercises On The Sidewalk Are Not Normal-వైరల్ వీడియో: నడిరోడ్డు పై ఈ యువతి వ్యాయమాలు మామూలుగా లేవుగా…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే మందు తాగి ఆ మత్తు విడిపోయేదాకా నానా రచ్చ చేసేవారు.కానీ ఇప్పుడు ఆడవాళ్లు సైతం పార్టీలలో, పబ్బులలో మందు తాగేస్తున్నారు.

మందు తాగి సైలెంట్ గా ఉంటే పర్వాలేదు.కానీ ఆ మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో తెలియకుండా ఇతరులను ఇబ్బంది పెడితే మాత్రం ఎలా చెప్పండి.ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన పుణే లో చోటుచేసుకుంది.ఎవరో తెలియదు కానీ ఒక మహిళ ఫుల్ గా మద్యం తాగి రోడ్డు మీద బైఠాయించి వెళ్లే పోయే వాహనాలకు అడ్డుగా కూర్చుంది.

ఆ వివరాలలోకి వెళితే.

పుణేలోని తిలక్‌ రోడ్డుపై ఈ ఘటన జరిగింది.హీరాబాగ్ చౌక్ దగ్గర రాత్రి 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్వర్గేట్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.ఆ మహిళ చూడడానికి మోడరన్ గానే ఉంది రెడ్ కలర్ టీ షర్ట్, జీన్స్ వేసుకుని జుట్టు వదిలేసి మోడరన్ గానే ఉంది.

మరి ఎక్కడ పార్టీలోనో, పబ్బులోనో బాగా తాగేసినట్లుంది.అర్ధరాత్రి 11 గంటల సమయంలో రోడ్డు మీద కూర్చిని వ్యాయామాలు చేయడంతో పాటు రోడ్డు పైన పడుకుని వెళ్లే పోయే వాహనాలకు అడ్డుగా ఉండి అక్కడ కొంతసేపు నానా హంగామా చేసింది.

ఈ యువతీ ఆగడాలు చూసిన అక్కడ వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి వెళ్లారు.అక్కడికి వెళ్లి చూస్తే ఆ యువతి అక్కడ లేదు.

ఆ చుట్టుపక్కల ఉన్న వారిని పోలీసులు అడగ్గా ఆ యువతి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు.అయితే పోలీసులు మాత్రం ఆ యువతిని పట్టుకునే పనిలో ఉన్నట్లు చెప్పారు.మరి ఆ యువతీ దొరికిందో లేదో తెలియదు గానిఆ మందు బేబీ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది.ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

కిక్కు బాగా ఎక్కినట్లు ఉంది.ఆ కిక్కు దిగే దాక తిక్క తిక్క పనులు చేస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా అసలు ఆమె మందు తాగిందో లేక మానసిక ప్రవర్తన సరిగా లేక అలా పిచ్చిపిచ్చి పనులు చేస్తుందో ఏమో అని మరొక నెటిజన్ కామెంట్ చేసాడు.

ఏది ఎలా ఉన్నా గానీ.ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

#Exercise #Road #Social Media #Driken #Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు