థాంక్స్ గివింగ్ డే అమెరికా మహిళకి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది...!!!

ఒక్కో సారి మనకి ఊహించని విధంగా, అనుకోకుకండా బహుమతులు వస్తాయి.అలాంటి షాకింగ్ పరిణామాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి.

 This Woman Got A Gift From Thanks Giving Day Party-TeluguStop.com

అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.అమెరికా మహిళ కి థాంక్స్ గివింగ్ డే రోజున ఊహించని గిఫ్ట్ ఇచ్చింది.

దాంతో సదరు మహిళా ఉబ్బితబ్బిబ్బై పోతోంది.అంతేకాదు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పంచుకోవడంతో నెటిజన్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఆమెకి అందిన ఆ అద్భుతమైన గిఫ్ట్ ఏమిటంటే.

ఫ్లోరిడా కి చెందిన నేరీడా అరాజో అనే మహిళ గర్భవతిగా ఉంది.

ఈ ఏడాది థాంక్స్ గివింగ్ డే రోజున తన కుటుంభ సభ్యులతో కలిసి డిన్నర్ చేయాలని భావించింది.దాంతో ఫ్లోరిడా నుంచీ తంపా నుంచీ మధ్యాహ్నం అమెరికన్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానంలో నార్త్ కరోలినా కి బయలు దేరింది.అయితే ఆమె నెలలు నిండిన గర్భవతి కావడంతో ఆమె భర్త కూడా ఆమెతో వెళ్ళాడు ఈలోగా

Telugu Telugu Nri Ups, Day, Wom-

ఆమెకి విమానంలోనే నెప్పులు మొదలయ్యాయి.దాంతో పైలెట్ వెంటనే విమానాన్ని అత్యవసరంగా షార్లట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశాడు.ఆసుపత్రికి తీసుకువెళ్ళే సమయం కూడా లేకపోవడంతో అక్కడి వైద్యులు ఆమెకి విమానశ్రయంలోనే పురుడు పోశారు.దాంతో ఆమె పండంటి పాపకి జన్మని ఇచ్చింది.విమానంలో పుట్టింది కాబట్టి ఆమెకి లిజైనా స్కై అనే పేరు పెట్టుకున్నారు.తనకి నెప్పులు రాగానే వెంటనే స్పందించిన విమాన సిబ్బందికి ధన్యవాదాలు చెప్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అయితే ఇకపై గర్భవతులు విమానం ఎక్కాలంటే తప్పకుండా డాక్టర్ సేఫ్టీ సర్టిఫికేట్ చూపించాలని అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube