ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న ఆసక్తికర సినిమాల, సిరీస్ ల జాబితా ఇదే!

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో విడుదలవుతూ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.మే నెలలో రిలీజైన సినిమాలలో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేదు.

 This Week Theatrical And Ott Release Series And Movies Ahimsa Nenu Student Sir P-TeluguStop.com

అయితే ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులకు ఆ లోటును కచ్చితంగా తీర్చడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో చిన్న సినిమాలదే హవా కావడం గమనార్హం.

దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస మూవీ( Ahimsa Movie ) ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

బెల్లంకొండ గణేష్ హీరో తెరకెక్కిన నేను స్టూడెంట్ సార్ మూవీ( Nenu Student Sir Movie ) కూడా ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది.సాయిచరణ్, పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఐక్యూ మూవీ( IQ Movie ) షూటింగ్ పూర్తి చేసుకుని ఈ వారం థియేటర్లలో రిలీజవుతోంది.

Telugu Ahimsa, Asur, Chakravyuham, Profile Web, Iq, Nenu Sir, Ott, Pareshan, Vis

కొత్త రకం కామెడీతో తెరకెక్కిన పరేషాన్ మూవీ( Pareshan ) కూడా ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది.విచిత్రం ఏంటంటే జూన్ 2వ తేదీన ఈ నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాలతో పాటు చక్రవ్యూహం అనే చిన్న మూవీ అదే తేదీన రిలీజ్ కానుందని బోగట్టా.ఓటీటీల విషయానికి వస్తే జియో సినిమాలో అసుర్2 అనే హిందీ సిరీస్ జూన్ 1న స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సులైకా మంజిల్ అనే మలయాళ మూవీ జూన్ 2న స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Telugu Ahimsa, Asur, Chakravyuham, Profile Web, Iq, Nenu Sir, Ott, Pareshan, Vis

జీ5 ఓటీటీలో విశ్వక్ అనే తెలుగు సిరీస్ జూన్ 2వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.నెట్ ఫ్లిక్స్ లో మే 31వ తేదీన ఫేక్ ప్రొఫైల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.జూన్ 1వ తేదీన ఎ బ్యూటిఫుల్ లైఫ్ హాలీవుడ్, న్యూ ఆమ్ స్టార్ డమ్ వెబ్ సిరీస్, ఇన్ఫినిటీ స్టోర్మ్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమ్ కానున్నాయి.

స్కూల్ హిందీ సిరీస్, మ్యానిఫెస్ట్ వెబ్ సిరీస్ జూన్ 2వ తేదీన స్ట్రీమింగ్ అవుతాయని బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube