బిగ్‌బాస్ : ఈవారం ఎలిమినేషన్‌ ఎవరో అప్పుడే తేలిపోయింది  

this week kumar sai will be eliminate surly , Big Boss, Nagarjuna, Harika, Monal, Mehabooba, Ariyana, Karate Kalyani, Kumar Sai - Telugu Ariyana, Bb4, Bigg Boss 4, Divi, Harika, Kumar Sai, Lasya, Nagarjuna, Telugu Bigg Boss

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మూడో వారంలో కి అడుగుపెట్టింది.మొదటి రెండు వారాలు చాలా సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్స్ ఇప్పుడు తమ మాస్క్‌ తీసేసి ఆడాల్సిన టైం వచ్చేసింది.

TeluguStop.com - This Week Kumar Sai Will Be Eliminate

నాగార్జున గత శని ఆదివారం ఎపిసోడ్ ఇంటి సభ్యులను తీవ్రంగా హెచ్చరించడంతో పాటు ఎలిమినేషన్ ను సీరియస్ గా తీసుకోవాలంటూ సూచించడంతో నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది.గతవారం బోట్‌ లోనుండి ఎవరు ముందు దిగితే వాళ్ళు ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ చెప్పాడు.

ఈ సారి మాత్రం ఇంటి సభ్యులు ఒక్కొక్కళ్ళు ఇద్దరు చొప్పున ఎలిమినేషన్ కి నామినేషన్ చేయాల్సి వచ్చింది.గత వారం ఎలిమినేషన్ అయిన కరాటే కళ్యాణి బిగ్ బాంబు రూపంలో టీవీ9 దేవిని నేరుగా నామినేట్ చేయడం జరిగింది.

TeluguStop.com - బిగ్‌బాస్ : ఈవారం ఎలిమినేషన్‌ ఎవరో అప్పుడే తేలిపోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక కెప్టెన్ హోదాలో నోయల్‌ లాస్య ను నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.ఆ తర్వాత జరిగిన నామినేషన్ ప్రక్రియ లో అత్యధికంగా కుమార్ సాయికి ఓట్లు పడ్డాయి.

ఆ తర్వాత హారిక, మోనాల్, మెహబూబ్, అరియానా లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

వీరిలో చాలా వీక్ కంటెస్టెంట్ అంటే ఎవరైనా చెప్పేపేరు కుమార్ సాయి.

ఈయనకు గత వారంలోనే అనూహ్యంగా ఇమ్యూనిటీ దక్కింది.కరాటే కళ్యాణి ఎలిమినేషన్ లో లేనట్లయితే ఈయన కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే వాడు అనేది సోషల్ మీడియా టాక్.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోవడం లేదు పైగా సభ్యులతో కలవడం లేదు.ఆ కారణంగా కుమార్ ను ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపించేందుకు ప్రేక్షకులు ఇతర కంటెస్టెంట్స్ కి ఎక్కువగా ఓట్లు వేసే అవకాశం ఉందని బిగ్ బాస్ విశ్లేషకుల అభిప్రాయం.

ఈ వారం కుమార్ సాయి కాకుండా మరి ఎవరు వెళ్లే అవకాశం లేదని అనిపిస్తుంది.ఎందుకంటే ఎలిమినేషన్ లో ఉన్న వాళ్లంతా కూడా మంచి క్రేజ్ ఉన్నవాళ్లే పైగా ఇంట్లో అంతో ఇంతో పేరు తెచ్చుకున్న వాళ్లే.

కనుక కుమార్ సాయి ఈవారం ఎలిమినేషన్ అవ్వక తప్పదు.ఈ మూడు నాలుగు రోజుల్లో ఏదైనా అద్భుతం జరిగి ఆయనపై సెంటిమెంట్ వర్కౌట్ అయితే తప్పితే కుమార్ సాయి ఉండడం సాధ్యం కాదు.

#Lasya #Harika #Kumar Sai #Bigg Boss 4 #Ariyana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

This Week Kumar Sai Will Be Eliminate Related Telugu News,Photos/Pics,Images..