తెలుగు ప్రేక్షకులు కరోనా సమయంలో కూడా సినిమా లను థియేటర్ల ద్వారా ఆధరించారు.కరోనా కేసులు నమోదు అవుతున్న సమయంలో ఉప్పెన సినిమాకు దాదాపుగా వంద కోట్లు ఇచ్చిన ఘనత కేవలం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది.
గత ఏడాది ఏ ఒక్క భాష సినిమా కూడా వంద కోట్లను టచ్ చేయలేదు.కాని మన అఖండ.
శ్యామ్ సింగరాయ్ మరియు పుష్ప సినిమా లు భారీ వసూళ్లను దక్కించుకున్న విసయం తెల్సిందే.ముఖ్యంగా పుష్ప సినిమా అక్కడ ఇక్కడ వందల కోట్లను దక్కించుకుంది.
ఇప్పడు కరోనా భయం లేదు.థియేటర్లు పూర్తి స్వేచ్చగా ఓపెన్ చేశారు.
దాంతో వారంకు మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.పెద్ద సినిమాలు అయితే ఒక్కటి మాత్రమే విడుదల అవుతుంది.
ఈ వారంలో పెద్ద సినిమా లు లేకపోవడంతో చిన్న సినిమా లు మూడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.మూడు సినిమాల్లో మొదటగా సుమ నటించిన జయమ్మ పంచాయితీ ఉండబోతుంది.
ఈ సినిమా కు ఉన్న పబ్లిసిటీ మరియు క్రేజ్ నేపథ్యంలో ఇతర రెండు సినిమాలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి.జయమ్మ పంచాయితీ జోరుగా పబ్లిసిటీ చేస్తున్నారు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా తో విశ్వక్ సేన్ దూసుకు వస్తున్నాడు.
ఈయన కూడా ఈనెల 6న విడుదల కాబోతున్నాడు.ఇటీవల ఫ్రాంక్ వీడియో.ఆ తర్వాత టీవీ 9 లో జరిగిన సంఘటనల కారణంగా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా బాగా పాపులర్ అయ్యింది.ఇక మూడవ సినిమా శ్రీ విష్ణు నటించిన భళా తందానా.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జక్కన్న పాల్గొనడం వల్ల మంచి అంచనాలు ఉన్నాయి.కనుక ఈ మూడు సినిమా ల్లో ఏది బెస్ట్ అంటే చెప్పలేం కాని మూడు సినిమా లో బజ్ మాత్రం సుమ సినిమాకు ఉంది.
ఆ తర్వాత విశ్వక్ సేన్ సినిమాకు ఉంది.విడుదల తర్వాత అటు ఇటు అయ్యే అవకాశాలు లేకపోలేదు.