బిగ్‌ బాస్ 5 నుండి పడబోతన్న 11వ వికెట్‌ ఎవరో తేలిపోయింది

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చింది.ఇప్పటి వరకు పది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అయ్యి బయటకు వెళ్లి పోయారు.

 This Week Is Late For Anee In Telugu Bigg Boss 5, Bigg Boss 5 , Telugu Biggboss-TeluguStop.com

నిన్న ఆదివారం ఎపిసోడ్ లో జెస్సీ బయటకు వెళ్లాడు.అతడి అనారోగ్య కారణంగా ఎలిమినేట్‌ చేయడం జరిగింది.

లేదంటే మరో రెండు మూడు వారాల వరకు ఉండే అవకాశం ఉండేది.నిన్నటి ఆది వారం కాజల్ ఎలిమినేట్‌ అయినట్లే అంటూ అంతా అనుకున్నారు.

కాని అనూహ్యంగా ఆమె కు జెస్సీ అనారోగ్య సమస్య కలిసి వచ్చింది.ఇక ఆనీ మాస్టర్‌ కు అనూహ్యంగా ఇమ్యూనిటీ దక్కుతు వచ్చింది.

గత మూడు నాలుగు వారాలుగా ఆమె వీక్ అయినా కూడా కంటిన్యూ అవుతుంది అంటూ కొందరు అంటున్నారు.ఆమె ఎప్పుడెప్పుడు ఎలిమినేషన్ కు నామినేట్‌ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ వారం యాంకర్ రవి కెప్టెన్‌ అవ్వడం వల్ల ఆయన తప్ప అందరు కూడా ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు.అయితే ట్విస్ట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి.

ఖచ్చితంగా ఆనీ మాస్టర్ బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో ఈ వారంతో ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆమె కనుక మరో వారం కంటిన్యూ అయితే ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు బిగ్ బాస్ టీమ్‌ పై యుద్దమే చేసేలా ఉన్నారు.

ఏ ఒక్కరికి ఆమె నచ్చడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఆమె వ్యవహారం నుండి మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులు ఇష్టపడే విధంగా లేవు అంటున్నారు.

అందుకే ఆమెను బిగ్ బాస్ టీమ్‌ వారు త్వరగా తప్పిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ వారం ఎలిమినేషన్‌ కు నామినేషన్‌ అయితే ఖచ్చితంగా ఆనీ బయటకు రావడం ఖాయం అనేది కన్ఫర్మ్‌.

ఈ వారంలో ఆమె నామినేషన్ లో ఉండటం కూడా పక్కా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube