ఈ వారం బాక్సాఫీస్‌ వెలవెలబోవాల్సిందేనా? ఒక్కటైనా గట్టి సినిమా వస్తుందా?

టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా లు వచ్చి దాదాపు నెల రోజులు కావస్తుంది.

 This Week 6 Tollywood Movies Coming To Box Office , Sandeep Kishan, This Week-TeluguStop.com

అయినా ఇప్పటి వరకు పెద్ద సినిమాలు.కానీ చిన్న సినిమాల్లో మంచి సినిమాలు కానీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.

వరుసగా ఒక సినిమా వెనుక మరో సినిమా అన్నట్లుగా వస్తూనే ఉన్నాయి.కానీ అవేవి ప్రేక్షకులను అలరించడం లేదు.

Telugu Butta Bomma, Michaels, Premadesam, Tupakulagudem, Sandeep Kishan, Tollywo

ఇక ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆరు సినిమాలు రెడీగా ఉన్నాయి.అందులో రైటర్ పద్మనాభం ఫిబ్రవరి మూడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అలాగే సందీప్‌ కిషన్ హీరోగా నటించిగా.విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్న మైఖేల్ సినిమా కూడా అదే ఫిబ్రవరి మూడో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.

ఇక సితార ఎంటర్ టైన్మెంట్స్ వారి బుట్ట బొమ్మ ఒక్కరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇవే కాకుండా ప్రేమదేశం, రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం, కథ వేనుక కథ సినిమాలు కూడా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఈ సినిమా లకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

Telugu Butta Bomma, Michaels, Premadesam, Tupakulagudem, Sandeep Kishan, Tollywo

మైఖేల్ సినిమాతో సందీప్ కిషన్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాను అనే నమ్మకం తో ఉన్నాడు.కానీ టీజర్ మరియు ఇతర పబ్లిసిటీ స్టఫ్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరించే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ వారం విడుదలయ్యే ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లకు నడిపించే అవకాశాలు కనిపించడం లేదని సినీ విశ్లేషకులు పెదవి వివరిస్తున్నారు.

కనీసం వచ్చే వారమైన తెలుగు బాక్సాఫీస్ వద్ద కళ కళ కనిపించే విధంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube