తల్లీబిడ్డల ప్రేమానురాగాలకు అద్దం పట్టే ఈ వీడియో వైరల్..!

కొడుకు పుట్టినప్పటి నుంచి పెద్దవాడు అయ్యే వరకు అమ్మప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు.కొడుకు ఎంత ఎదిగిన ప్రతి తల్లికి తన కొడుకు చిన్న పిల్లాడిలానే కనిపిస్తుంటాడు.

 This Video Is Viral Reflecting The Love Of Mothers And Children Tiger Video, Vi-TeluguStop.com

పెద్దవాళ్లైన తర్వాత కొడుకు ప్రేమలో మార్పు కనిపిస్తుందేమో కానీ తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు కనిపించదు.తల్లి ప్రేమ గొప్పది.

ప్రపంచంలో తల్లికి మించిన యోధురాలు ఎవరూ ఉండరు.ఈ ప్రేమ కేవలం మనుషులకే పరిమితం కాదు.

జంతువుల్లోనూ, పక్షుల్లోనూ ఈ ప్రేమను చూస్తూనే ఉంటాం.

పశ్చిమ బెంగాల్ జిల్లాలోని సిలిగురిలో బెంగాల్ సఫారి పార్కు ఉంది.

పర్యాటకులకు ప్రత్యేకమైన ఈ పార్కులో రెండు రోజుల కిందట ఓ పులి పురుడు పోసుకుంది.పండంటి మూడు పులి పిల్లలను జన్మనిచ్చింది.

జంతు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో తల్లి పులి, పిల్లలు క్షేమంగా ఉన్నారు.అయితే పులి పిల్లలు చేస్తున్నఅల్లరి అంతా ఇంతా కాదు.

చిన్ని చిన్ని అడుగులు వేస్తూ.కింద పడి లేస్తున్న సన్నివేశాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.

తల్లితో ఆడుకోవడం.ముగ్గురి పులిపిల్లలు ఒకరిపై ఒకరు బొర్లుతూ పడటం అందరి ఆకట్టుకుంటున్నాయి.

దీంతో అక్కడి సిబ్బంది ఈ సీసీ టీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తల్లీబిడ్డల ప్రేమానురాగానికి అద్దం పడుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిన్ని పులి పిల్లల అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కాగా, బెంగాల్ సఫారి పార్కు 297 హెక్టార్లలో విస్తరించి ఉంది.ఈ పార్కును ఉత్తర బెంగాల్ వైల్డ్ యానిమల్ పార్క్ అని కూడా అంటారు.

ఈ పార్కులో హిమాలయ నల్ల ఎలుగు బంట్లు, ఏనుగులు, కొమ్ము ఖడ్గ మృగాలు, జింకలు, పులులు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube