ఈ వర్మ ఉన్నాడే ... పవన్ కు ఇరిటేషన్ తెప్పిస్తున్నాడే ?

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తూ సంచలనాలకు మారుపేరుగా మారిపోయారు.ఇక సినిమాలతో పాటు, రాజకీయాల పైన ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ , గత కొంతకాలంగా ఏపీ రాజకీయ వ్యవహారాలపై తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ వస్తున్నారు.

 This Verma Is There Bringing Irritation To Pawan ,pavan Kalyan, Rgv, Ram Gopal-TeluguStop.com

ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు , లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన సందర్భం వచ్చినప్పుడల్లా సేటారికల్ కామెంట్స్ చేస్తూ వర్మ వార్తల్లో ఉంటున్నారు.తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  ఆయన ప్రచార రథం వారాహిపైన వర్మ సంచలన కామెంట్స్ చేశారు.

Telugu Chandrababu, Lokesh, Pavan Kalyan, Pavan Vehical, Ram Gopal Varma, Varahi

ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం, దాని డిజైన్ పైన విమర్శలు చేశారు వర్మ .తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్.ఈ సందర్భంగా వర్మ సెటైర్లు వేశారు.పవన్ కళ్యాణ్ స్వామి వివేకానందుడిగా వర్మ వర్ణించారు.హిట్లర్ వాహనంపై స్వామి వివేకానందుడు అంటూ సెటైర్లు వేశారు.ఇక మరో ట్వీట్ లో వారాహి వాహనంపై ట్వీట్ చేశారు.

ఆ వాహనాన్ని పంది వాహనంగా వర్మ అభివర్ణించారు.హిట్లర్ స్వామి వివేకానంద ఆయన కుడి ఎడమ పాదాలను నొక్కుతారు.

పవర్ స్టార్ పవర్ అంటే అదేనంటూ వ్యంగంగా విమర్శలు చేశారు .

Telugu Chandrababu, Lokesh, Pavan Kalyan, Pavan Vehical, Ram Gopal Varma, Varahi

ఈ సందర్భంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చైతన్య రథం ప్రస్తావనను వర్మ తీసుకువచ్చారు.టిడిపి స్థాపించిన మొదట్లో ఎన్టీఆర్ చైతన్య రథం మీద తిరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్  పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటూ విమర్శించే వారిని జనసేనలతో బస్సు టైర్ల కింద తొక్కించాలని , అలా చేయడం లీగల్ గా ఇబ్బంది అనుకుంటే కనీసం కేసులు అన్న పెట్టించండి అంటూ వర్మ పవన్ ను కోరారు.ఇది ఒక అభిమానిగా తన విన్నపం అంటూ చెప్పుకొచ్చారు.

గుడిలో ఉంటే అది వారాహి అవుతుందని , అదే రోడ్డు మీద ఉంటే పంది…పీ , తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవత దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని, వెంటనే వాళ్ళ నోరు మూయించకపోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సు గా ముద్ర వేస్తారని సేటెర్లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube