పుష్పలో బన్నీతో తలపడే మరో విలన్ ఎవరు..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఆఫర్లతో తెగ బిజీగా ఉన్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.

 This Time To Know Who Is Pushpa Raj Villain, Pushpa, Allu Arjun, Tollywood, Faha-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా టీజర్ కూడా విడుదల కాగా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.ఇందులో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

పాన్ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.అక్రమ గంధపు చెక్కల స్మగ్లింగ్ రవాణా నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ సినిమా లో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.

అంతేకాకుండా రష్మిక మందన కూడా తన పాత్ర తో బాగా ఆకట్టుకునేలా ఉంది.మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని వినిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం కూడా అందింది.ఇక ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ నెగటివ్ పాత్రలో నటిస్తుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ అందుతూనే ఉంది.ఇక ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించే నటుడు ఎవరు అనుకోగా మొత్తానికి ఫహద్ అని తెలిసింది.

Telugu Allu Arjun, Fahadh, Pushpa, Tollywood-Movie

ఈ సినిమాల్లో ఫహద్ పాత్ర ఎండింగ్ లో వస్తుందని తెలిసింది.కానీ బన్నీ ఇందులో మొదటి పార్ట్లో తలపడే విలన్ ఎవరని అభిమానులల్లో బాగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఇందులో స్మగ్లింగ్ సమయంలో బన్నీ ఫైట్ చేయడానికి మరో విలన్ ఉంటాడా అని చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన అందలేదు.ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో ఆఫర్లు అందుకున్నాడు బన్నీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube