ఈ దొంగ రూటే సెప‌రేటు.. కేవ‌లం అవి మాత్ర‌మే దోచుకెళ్తాడంట‌..

సాధార‌ణంగా దొంగ‌లు ఏం చేస్తారు ? అందేం ప్ర‌శ్నండి.దొంగ‌తనం చేస్తారు ఇదేగా మీ స‌మాధానం.

 This Thief Route Is Separate They Are The Only Ones Who Rob, Thief, Viral News, Thief Stealing Slippers, Masjid, Namaz, Cc Tv Footage, Strange Thief, Rob Only Foot Wear, Caught-TeluguStop.com

అవును.కానీ ఏం దొంగ‌త‌నం చేస్తారు ? ఏవో విలువైన న‌గ‌ల‌నో, బ‌ట్ట‌ల‌నో, ఇత‌ర ముఖ్య‌మైన వ‌స్తువుల‌నో చోరీ చేస్తారు.కానీ ఓ దొంగ మాత్రం అదే ప‌నిగా చెప్పులు దోచేస్తున్నాడు.ఎక్క‌డ చెప్పులు గుంపులుగా క‌నిపిస్తాయో అక్క‌డ వాలి వాటిని మాయం చేస్తున్నాడు.గుడి, మ‌సీదు వంటి వాటి ద‌గ్గ‌ర‌కూ వ‌చ్చేసి చెప్పుల‌ను క‌నిపించ‌కుండా చేస్తున్నాడు.మ‌రి ఈయ‌న గురించి ఎలా బ‌య‌ట‌ప‌డింది అంటారా ? ఎంత పెద్ద దొంగయినా చిన్న త‌ప్పు చేస్తాడు.అది త‌న‌ను ఎవ‌రు ప‌ట్టుకుండులే అని ధైర్య‌మో లేక‌, ఏమ‌రపాటో, లేక నిర్ల‌క్ష్య‌మో ఇంకాఏదైనా కానివ్వండి.ఆ చిన్న త‌ప్పే వారిని దొంగ‌త‌నం బ‌ట్ట‌బ‌య‌ల‌య్యేలా చేస్తుంది.ఇక్క‌డ కూడా ఈ దొంగ అలాంటి త‌ప్పే ఒక‌టి చేశాడు.ఓ మ‌సీదులో దొంగ త‌నం చేసేట‌ప్పుడు పైన సీసీ కెమెరా ఉన్న సంగ‌తి గ‌మ‌నించ‌లేదు.

ఆ సీసీ కెమెరానే ఈ దొంగ‌ను ప‌ట్టించింది.

 This Thief Route Is Separate They Are The Only Ones Who Rob, Thief, Viral News, Thief Stealing Slippers, Masjid, Namaz, Cc Tv Footage, Strange Thief, Rob Only Foot Wear, Caught-ఈ దొంగ రూటే సెప‌రేటు.. కేవ‌లం అవి మాత్ర‌మే దోచుకెళ్తాడంట‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌సీదులోకి భ‌క్తులంతా నమాజ్ చేసుకునేందుకు వ‌చ్చారు.

ఎప్ప‌టిలాగే బ‌య‌ట చెప్పులు విడిచి లోప‌లికి వెళ్లారు.ఈ దొంగ మెళ్ల‌గా వ‌చ్చి త‌న‌కు న‌చ్చిన చెప్పుల‌ను తీసుకొని, ఒక్క ద‌గ్గ‌రికి చేసి త‌న ష‌ర్ట్ లోప‌ల‌, ప్యాంట్ లోప‌ల దాచేస్తున్నాడు.

ఇలా చాలా చెప్పుల‌ను దోచేసుకొని అక్క‌డి నుంచి ఉడాయించాడు.ఈ తతంగం అంతా అక్క‌డున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.తీరిగ్గా న‌మాజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన భ‌క్తులు చెప్పులు లేక‌పోవ‌డంతో ప‌రేషాన్ అయ్యారు.ఒక‌రిద్ద‌రి చెప్పులు లేక‌పోతే వారు కూడా ఇలా కంగుతినేవారు కాదు.ఒకే సారి అంత‌మందివి క‌నిపించ‌క‌పోవ‌డం అక్క‌డున్న సీసీ కెమెరా ఫుటేజ్ ప‌రిశీలించారు.అందులో ఈ దొంగ చేసిన ప‌ని అంతా రికార్డ్ అయ్యింది.

త‌రువాత ఏమై ఉంటుందీ ఇదేగా మీ ప్ర‌శ్న‌.ఏమై ఉంటుందండి.

దొంగ ఫేస్ స్ప‌ష్టంగా క‌నిపించ‌డం వ‌ల్ల ఆ దొంగ ఎవ‌రో క‌నిపెట్టి, ప‌ట్టుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube