ఈ దొంగ మామూలోడు కాదు.. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలని అనుకున్నాడంటే!

సాధారణంగా దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు శరవేగంగా పరిగెడతారు.సందు, గొందుల్లో నక్కుతూ ఎస్కేప్ అవుతుంటారు.

 This Thief Is Not Ordinary How Did He Want To Escape From The Police ,thief, Flo-TeluguStop.com

అయితే తాజాగా ఫ్లోరిడాకు చెందిన దొంగను పట్టుకోవడానికి పోలీసులు నేల, నీటితోపాటు ఏకంగా ఆకాశంలో కూడా ప్రయాణం చేయాల్సి వచ్చింది.ఈ దొంగ ముప్పతిప్పలు పెట్టినా పోలీసులు అతన్ని ఎట్టకేలకు అరెస్టు చేశారు.

ఈ చోరుడు ఒక మహిళ వాలెట్‌ను లాక్కుని పరుగెత్తడం ప్రారంభించాడు.అయితే పోలీసులు అతని వెంటే వచ్చారు.

ఈ క్రమంలో ఒక యాక్షన్ సినిమా రేంజ్‌లో చేజింగ్ చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.

అక్టోబరు 1, శనివారం ఉదయం 8 గంటలకు ఎన్ వెస్ట్‌షోర్ బీఎల్‌వీడీ ప్రాంతంలోని హోటల్ పార్కింగ్ స్థలంలో ఒక మహిళ చేతిలో ఉన్న వాలెట్‌ను డెవేన్ డీన్ (32) కొట్టేశాడు.అనంతరం అక్కడి నుంచి ఈ దొంగ పరారయ్యాడు.

డెవేన్ డీన్ వెంటే పోలీసులు పడడంతో అతడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు.పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అతడు సముద్రంలోకి దూకి 200 అడుగుల దూరం ఈత కొట్టాడు.

దాంతో ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు.ఆ విధంగా సైప్రస్ పాయింట్ బీచ్‌కి సమీపాన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విషయాన్ని టంపా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.

ఈ గజదొంగ ఫొటోని కూడా ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేశారు.

ఈ ఫొటోలో హెలికాప్టర్ అతని పైన కదులుతున్నప్పుడు ఆ దొంగ తన చేతులు పైకెత్తి లొంగిపోతున్నట్లు సైగ చేసినట్లు కనిపించింది.అరెస్టు చేశాక ఇతడిపై పలు రకాల కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు పోలీసులు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ దొంగ మామూలోడు కాదు అని కామెంట్ చేస్తున్నారు.“ఈ దొంగ గొప్ప అథ్లెట్‌, ఇతన్ని ఒలంపిక్స్‌కి కచ్చితంగా పంపించాలి.” అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube