వింట‌ర్‌లో ఈ సూప్ తాగితే ఇమ్యూనిటీ సూప‌ర్‌గా పెరుగుతుంద‌ట‌!

వింట‌ర్ సీజ‌న్ స్టార్ అయింది.ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వాతావ‌ర‌ణం మార్పులు.

 This Soup Very Healthy In Winter Season! Soup, Drumstick Leaves Soup, Latest News, Health Tips, Good Health, Winter Season, Immutable Power, Winter Season Tips,-TeluguStop.com

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రి ఇమ్యూనిటీ సిస్టిమ్ బ‌ల‌హీనంగా మారిపోతుంది.అందు వ‌ల్ల‌నే, వింట‌ర్‌లో జ‌లుబు, ఫ్లూ, ద‌గ్గు, ఆస్తమా, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు, ముక్కు నుండి రక్తం రావ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌రుచుకోవాల‌నుకుంటే వింట‌ర్‌లో ఖ‌చ్చితంగా మీరో సూప్ తీసుకోవాల్సిందే.అదే మున‌గాకు సూప్‌.

 This Soup Very Healthy In Winter Season! Soup, Drumstick Leaves Soup, Latest News, Health Tips, Good Health, Winter Season, Immutable Power, Winter Season Tips, -వింట‌ర్‌లో ఈ సూప్ తాగితే ఇమ్యూనిటీ సూప‌ర్‌గా పెరుగుతుంద‌ట‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవును, చ‌లి కాలంలో మున‌గాకు సూప్‌ను త‌ర‌చూ తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.పైగా మునగాకు సూప్‌ను త‌యారు చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కూడా కాదు.

మొద‌ట ఒక పాత్ర‌లో రెండు స్పూన్ల‌ నూనెను వేసి వేడి చేయాలి.నూనె వేడెక్కాక అర స్పూన్ జీల‌కర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు మూడు వేసి వేయించాలి.

ఆ త‌ర్వాత అర క‌ప్పు ఉల్లిపాయ ముక్క‌లు, అర క‌ప్పు ట‌మాటా ముక్క‌లు, చిటికెడు ఉప్పు వేసి ప‌చ్చి వాస‌న పోయేవ‌ర‌కు ఫ్రై చేసి.ఆపై క‌డిగిన మున‌గాకు కూడా వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.

Telugu Drumstick Soup, Tips, Immutable, Latest, Soup, Season, Season Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇప్పుడు రెడు గ్లాసుల వాట‌ర్, అర స్పూన్ మిరియాల పొడి, రుచికి స‌రిప‌డా ఉప్పు వేసుకుని పావు గంట పాటు మ‌రిగిస్తే.మున‌గాకు సూప్ సిద్ధ‌మైన‌ట్టే.వింట‌ర్ సీజ‌న్‌లో ఈ మున‌గాకు సూప్‌ను వారానికి మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే గ‌నుక‌.ఇమ్యూనిటీ ప‌వ‌న్ సూప‌ర్‌గా పెరుగుతుంది.దాంతో జ‌లుబు, ఫ్లూ, ద‌గ్గు, జ్వ‌రం వంటి సీజ‌న్ వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అంతేకాదు, మున‌గాకు సూప్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.ర‌క్త హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.

దృష్టి సంబంధిత స‌మ‌స్య‌లేమైనా ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు సైతం వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube