ఈమధ్య సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా నిమిషాలలో ప్రపంచం మొత్తం ఆ విషయం తెలిసిపోతుంది.ఇక ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.ఇక అసలు విషయంలోకి వెళితే… భూమి మీద ఎన్నో రకాల పాములు మనం చూస్తూనే ఉంటాయి.
కొన్ని రకాల పాములు చూడటానికి ఎంతో అందంగా ఉండేలా కనిపిస్తుంటాయి.పాములు కూడా ఇంత అందంగా ఉంటాయా అంటూ కొన్ని ఫోటోలను చూస్తే మనకు అనిపించకమానదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
ఇక ఆ వీడియోలో ఉన్న పాము గురించి మాట్లాడితే… ఆ పాము పేరు బ్లూ పిట్ వైపర్.
ఇక ఈ పాము కి సంబంధించి వీడియోని చూసి చాలా మంది ఎంత ముద్దుగా ఉంది కదా అంటూ తెగ పొగిడేస్తున్నారు.పూర్తిగా నీలం వర్ణంలో ఉన్న ఆ పాము ఎర్రటి రోజా మీద కూర్చొని అటు ఇటు కదలాడుతుంది.
అయితే అందంగా కనపడినంతమాత్రాన ఆ పాము మంచిదని అనుకోకండి.ఎందుకంటే ఆ పాము ఒక్కసారి మానవ శరీరం కు కాటు వేసిందా ఇక అంతే సంగతులు.శరీరంలోని చాలా భాగాలలో తీవ్ర రక్తస్రావం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అంట.
ఇక ఆ పాము చాలా విషమైనదని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ రకమైన పాములు ఎక్కువ ఇండోనేషియా దేశంలో ఉంటాయని తెలుస్తోంది.అయితే ఇలాంటి పాములు పూర్తిగా ఆకుపచ్చరంగులో ఉంటాయని కాకపోతే నీలం రంగులో కనిపించడం చాలా అరుదు అని అక్కడి వన్య ప్రాణ అధికారులు తెలుపుతున్నారు.
ఆ పాము చాలా అందంగా ఉన్నప్పటికీ, దానికి వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.అంతే కాదు ఆ పాములు చాలా కోపంతో ఉంటాయని కూడా తెలుపుతున్నారు.