అమెరికా జంట అప్పనంగా వచ్చిందని లక్ష డాలర్లు ఖర్చు చేశారు...చివరికి

సహజంగా మనకి తెలియకుండా మన ఖాతాలో వేల రూపాయలో , లక్షల రూపాయలో జమ అయినప్పుడు ఏమి చేస్తాం కంగారు పాడుతాం, అది ఎలా వచ్చిందో తెలుసుకుంటాం , మన బ్యాంక్ అధికారులకి సంచారం అందిస్తాం.కొన్ని కొన్ని పొరబాట్లు వలన ఇలాంటి పరిస్థితులు తెలేత్తుతూ ఉంటాయి.

 This Smart America Couple Miss Use Bankmoney Unknown Account Money-TeluguStop.com

కానీ అమెరికాలో ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా చేసింది.వివరాలలోకి వెళ్తే.

Telugu America, Telugu Nri Ups, Telugu Ups-

 

పెన్సిల్వేనియా కి చెందిన ఓ జంటకి ఓ రోజు తమ బ్యాంక్ ఖాతాలో లక్షా ఇరవై వేల డాలర్లు జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది.మెసేజ్ వచ్చీ రాగానే వారు అందరిలా ఖంగారు పడలేదు.వెంటనే విలాసవంతమైన జీవితం గడపాలని అనుకున్నారు.అనుకున్నదే తడవుగా విపరీతమైన ఖర్చులు చేస్తూ కేవలం 15 రోజుల్లో మొత్తం డబ్బుని ఖర్చు చేసేశారు.అంతేకాదు ఈ మధ్యలో వీరికి ఉన్న ఉదార స్వభావం వలన ఆపదలో ఉన్న స్నేహితులకి డబ్బుని కూడా ఇచ్చారు.

Telugu America, Telugu Nri Ups, Telugu Ups-

  ఈ క్రమంలో డబ్బు ఆడిట్ చేసుకుంటున్న బ్యాంక్ అధికారులకి సదరు డబ్బు తేడా రావడంతో లెక్కలు చూడగా ఈ జంట ఖాతాలో జమ అయినట్టుగా తెలిసి వెళ్లి అడిగారు.మా దగ్గర డబ్బు లేదు ఖర్చు అయ్యిందని తాపీగా బదులు ఇచ్చారు ఈ జంట.దాంతో చిర్రెత్తు కొచ్చిన అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేసి తిన్న డబ్బు కక్కించమని కోరారు.అయితే కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచాగా మా దగ్గర అంత డబ్బు లేదని, ఖర్చు చేసేశామని చేతులు ఎత్తేశారు.దాంతో కోర్టు వారికి బెయిల్ తో పాటు డబ్బు కట్టమని ఆదేశాలు జారీ చేసింది.

మరి డబ్బు కడుతారో లేదో జైల్లో ఊచలు లెక్క పెడుతారో, బ్యాక్ అధికారులు ఎలా రికవరీ చేస్తారో అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube