వైరల్.. బుడ్డోడు చేసిన పనికి శభాష్ అంటున్న నెటిజెన్స్.. ఏం చేసాడంటే ?

చిన్న పిల్లలు ఏం చేసిన ముద్దుగానే ఉంటుంది.మాములుగా అయితే పిల్లలు అంత చిన్న వయసులో ఏమి చేస్తుంటారు.

 This Small Kid Video Went Viral On Social Media, Viral Video, Telangana Boy, Raj-TeluguStop.com

మహా అయితే స్కూల్ కు వెళుతూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తమ బాల్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.అంతేకాదు ఇక్కడ బుడ్డోడు చేసినట్టు మిగతా పిల్లలు చేయలేరు.

చేయరు కూడా.కానీ ఈ చిన్నోడు పట్టుమని 8 ఏళ్ళు నిండకుండానే అందరి చేత శభాష్ అనిపించు కుంటున్నాడు.

అంతలా మెచ్చుకునే పని ఏం చేశాడా అని అనుకుంటున్నారా.ఈ బుడ్డోడు చేసిన పని తెలుసుకుంటే మీరు కూడా ఆ బాలుడుని శభాష్ అని అనకుండా ఉండరు.

అంత చిన్న వయసులోనే పొలంలో తన తండ్రికి సహాయం చేయడానికి రెడీ అయి పోయాడు.అది చూసిన తండ్రి కళ్ళు ఆనందంతో చెమ్మ గిల్లాయి.ఇప్పుడు ఆ బుడ్డోడు గొర్రు పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

అదే జిల్లాకు చెందిన బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి 7 ఏళ్ల కొడుకు శ్రీతన్ ఉన్నాడు.శ్రీనివాస్ పొలానికి వెళ్లేప్పుడు తనతో పాటు కొడుకుని, కూతురుని కూడా తీసుకెళ్లాడు.

అయితే తండ్రి చేస్తుంటే కొడుకు కూడా తండ్రికి సహాయం చేయడం కోసం పొలం లోకి దిగాడు.దిగడమే కాదు గొర్రుతో పొలం దున్నడానికి కూడా సిద్ధం అయ్యాడు.

Telugu Telangana Boy, Small Kid-Latest News - Telugu

అంత చిన్న వయసులో నాగలి పట్టి గొర్రు తో దున్నుతున్న కొడుకుని వీడియో తీసి తన తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ బుడ్డోడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు.శభాష్ బుడ్డోడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.పెద్ద వెళ్ళే తన తండ్రికి సహాయం చేయడానికి ముందుకు రాని ఈ రోజుల్లో అంత చిన్న వయసుకే తన తండ్రి కష్టం చూడలేక ముందుకు వచ్చిన ఆ బుడ్డోడిని చూసి నెటిజెన్స్ సంతోష పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube