ఈ సింగిల్ హెయిర్ మాస్క్ మీ జుట్టును ఒత్తుగా, సిల్కీగా మరియు షైనీగా మారుస్తుంది.. తెలుసా?

కురులు ఒత్తుగా, సిల్కీగా మరియు షైనీగా మెరుస్తూ ఉంటే ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అందుకే అటు వంటి కురుల కోసం మగువ‌లు ఎంత‌గానో ఆరాటపడుతుంటారు.

ఇందులో భాగంగానే త‌ర‌చూ సెలూన్‌కు వెళ్లి జుట్టుకు కెరాటిన్ ట్రీట్‌మెంట్ ను చేయించుకుంటూ ఉంటారు.అయితే స‌హ‌జంగానే కురుల‌ను ఒత్తుగా, సిల్కీగా మరియు షైనీగా మార్చుకోవ‌చ్చు.

అవును, ఈ మూడు ప్రయోజనాలను ఇప్పుడు చెప్పబోయే సింగిల్ హెయిర్ మాస్క్ మీకు అందిస్తుంది.మరి ఆ హెయిర్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు చూసేద్దాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, ఒక ఎగ్ వైట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

డ్రై హెయిర్‌ అన్న మాటే అనరు.కురులు సిల్కీగా, షైనీగా మెరుస్తాయి.

హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ హోమ్ మేడ్ మాస్క్ ఉత్తమంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.స్కాల్ప్ ఆరోగ్యంగా తయారవుతుంది.

దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పట్టి.ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కాబట్టి ఎవరైతే తమ జుట్టు ఒత్తుగా, సిల్కీగా మరియు షైనీగా మెరుస్తూ ఉండాలని భావిస్తున్నారో తప్పకుండా వారు ఈ హెయిర్ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు