ఈ శివలింగానికి గ్లాస్ నీటితో అభిషేకం చేస్తే చాలు సమస్యలు తీరిపోతాయి!

This Shivalinga With A Glass Of Water Will Slove All The Problems Shivalinga, Worshiped, Hindhu Belives, Slove All Problems , Chatish Ghad , Lord Shiva Temple , History Of Temple

ఆ పరమ శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే.స్వామివారి అనుగ్రహం మనపై కలగాలంటే స్వామివారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేస్తే చాలు స్వామివారు ప్రసన్నమయ్యి మన కోరికలను తప్పక నెరవేరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

 This Shivalinga With A Glass Of Water Will Slove All The Problems Shivalinga,-TeluguStop.com

ఈ క్రమంలోనే పరమశివుడికి ఎంతో మంది భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేయడం మనం చూస్తున్నాము.కానీ మన కోరికలు నెరవేరాలన్న, సమస్యలు తీరిపోవాలన్న భూతేశ్వర్ నాధ్ ఆలయం సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఒక గ్లాసు నీటితో అభిషేకం చేస్తే చాలు మన సమస్యలు తీరిపోతాయి.

మరి ఈ ఆలయంలో ఉన్న స్వామివారి మహిమ ఏమిటి? ఆలయ విశిష్టత గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని మరోడా గ్రామంలో భూతేశ్వరనాధ్ ఆలయం ఉంది.

చుట్టూ దట్టమైన అడవులు, అందమైన వాతావరణం మధ్యలో స్వామి వారు లింగాకారంలో కొలువై ఉన్నారు.ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో శివలింగం మనకు దర్శనమిస్తుంది.

ఈ ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుందని, ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిఏటా శివలింగం ఎత్తును రికార్డు చేస్తారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

నిత్యం ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని పెద్దఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే శ్రావణమాసం వంటి ప్రత్యేకమైన మాసాలలో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని స్వామివారి పై గ్లాసు నీటిని పోసి అభిషేకం చేస్తారు.ఇలా చేయడం వల్ల వారికి ఉన్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని భక్తులు భావిస్తారు.

మరికొంత మంది భక్తులు కాలినడకన కూడా ఈ ప్రాంతానికి చేరుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.ఈ విధంగా స్వామి వారికి ఒక గ్లాసు నీటిని పోయటం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా తొందరగా పరిష్కారం అవుతుందని అక్కడి భక్తుల విశ్వాసం.

ఇక మహాశివరాత్రి, కార్తీకమాసం వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube