ప్రపంచంలోనే అరుదైన రెస్టారెంట్‌.. వెళ్లే అవకాశం ఎలాగూ ఉండదు, కనీసం ఈ వింత రెస్టారెంట్‌ గురించి తెలుసుకోండి  

This Restaurant In France It Is A Rare Restaurant In The World-

ఏ వ్యాపారం చేసినా కూడా దాన్ని పబ్లిసిటీ చేసి నలుగురికి తెలిసే విధంగా చేస్తేనే ఆ వ్యాపారం విజయం సాధిస్తుంది.ముఖ్యంగా నలుగురు వినియోగదారులను ఆకర్షించాలంటే చాలా విభిన్నంగా వినూత్నంగా ప్రయత్నాలు, ప్రమోషన్స్‌ చేయాల్సి ఉంటుంది.

This Restaurant In France It Is A Rare Restaurant In The World--This Restaurant In France It Is A Rare The World-

ఉదాహరణకు ప్రస్తుతం ఎన్నో సబ్బులు ఉన్నాయి.కొత్తగా ఒక సబ్బు వస్తే జనాలు వెంటనే దాన్ని ఎగబడి కొనేయరు.

This Restaurant In France It Is A Rare Restaurant In The World--This Restaurant In France It Is A Rare The World-

కొత్త వాటికి దృష్టి వెళ్లాలి అంటే అత్యంత ఖర్చుతో పబ్లిసిటీ చేయాలి, అది కూడా వినూత్న రీతిలో అరే ఇదేదో కొత్తగా ఉందే, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా వారిలో ఆలోచన కలిగేలా చేయాలి.అలా చేసినప్పుడే ఏ వస్తువు అయినా విజయాన్ని సొంతం చేసుకుంటుంది.వ్యాపారాన్ని వినూత్నంగా ప్రచారం చేసి విజయాన్ని సాధించాలని భావించిన ప్రాన్స్‌కు చెందిన కవలలు న్యూడ్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

2016లో ప్రాన్స్‌లోని ఒక ఖరీదైన ఏరియాలో ఈ న్యూడ్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.ఈ రెస్టారెంట్‌కు వచ్చే వారు పూర్తి న్యూడ్‌గా మారాల్సింది.న్యూడ్‌ రెస్టారెంట్‌లో ఏం తినాలన్నా, తాగాలన్నా కూడా ఒంటిపై ఉన్న బట్టలన్నీ కూడా తీసేయాల్సిందే.

ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా మొత్తం నగ్నంగా మారిపోయి ఆ తర్వాత డైనింగ్‌ హాల్‌కు వెళ్లాల్సి ఉంటుంది.ఇలా మగవారు మరియు ఆడవారు కూడా చేయాల్సిందే.ఈ కండీషన్‌కు ఒప్పుకుంటేనే ఆ రెస్టారెంట్‌లోకి ఎంట్రీ ఉంటుంది.ఈ రెస్టారెంట్‌లో వర్క్‌ చేసే చెఫ్‌, సర్వర్‌ మరియు ఇతరులు మాత్రమే డ్రస్‌లు వేసుకుంటారు.

కస్టమర్స్‌ మాత్రం తప్పకుండా న్యూడ్‌గా ఉండాల్సిందే.

ఈ రెస్టారెంట్‌లో ప్రతీది కూడా చాలా ఖరీదుగా ఉంటుంది.ఈ రెస్టారెంట్‌ ఓనర్స్‌ తమ న్యూడ్‌ ఐడియాపై స్పందిస్తూ… తమ రెస్టారెంట్‌కు వచ్చిన వారు ఎలాంటి దాపరికాలు లేకుండా పూర్తి స్వచ్చంగా, స్వేచ్చగా మాట్లాడుకోవడంతో పాటు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి పని చేశాం.మా రెస్టారెంట్‌కు మంచి స్పందన వచ్చింది.వినూత్యంగా ఆలోచించే వారు, కొత్త వాటిని రుచి చూడాలనుకునే వారు మా రెస్టారెంట్‌కు భారీగా వచ్చారు.ఇప్పటి వరకు మా రెస్టారెంట్‌కు లక్ష మంది వరకు వచ్చారని చెప్పాడు.

ఇంతటి క్రేజ్‌ ఉన్న రెస్టారెంట్‌ను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మూసేయబోతున్నారట.ప్రేమికుల రోజు తర్వాత నుండి ఈ రెస్టారెంట్‌ తెరుచుకోదని స్థానికులు అంటున్నారు.ఈలోపే అక్కడికి వెళ్లాలనే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు.