Hair Growth : హెయిర్ గ్రోత్ ఆగిపోయిందా? వ‌ర్రీ వ‌ద్దు.. ఇలా చేయండి!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం, జుట్టు సంరక్షణ లేకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి తదితర కారణాల వల్ల కొందరిలో హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.

దాంతో హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడం కోసం ఖరీదైన నూనె, షాంపూలను వాడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ఆగిపోయిన హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు ఆవాలు వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న ఆవాలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆవాల పొడిలో ఒక కప్పు ఫ్రెష్ గంజిని పోసి బాగా మిక్స్ చేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు వదిలేయాలి.

Advertisement

అనంతరం ఈ మిశ్ర‌మం నుండి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి ఒక గంట పాటు షవర్ క్యాప్ ధరించాలి.

అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు కనుక చేస్తే హెయిర్ గ్రోత్ సూపర్ గా రెట్టింపు అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

హెయిర్ ఫాల్ అదుపులోకి వస్తుంది.చుండ్రు సమస్య ఉన్నా స‌రే దూరం అవుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు