లైక్ ల కోసం అని ఇలా చేశారు,అరెస్ట్ అయ్యారు  

Two Youth Arrested For Having Gun-

టిక్ టాక్ వీడియో లు ఎంతగా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయో అన్న విషయం తెలిసిందే.ఈ వీడియో ల వల్ల ఎందరో తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నప్పటికీ జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.తాజాగా ఒక టిక్ టాక్ వీడియో సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే ఇద్దరు యువకులు బైక్ పై గన్ పట్టుకొని తిరుగుతూ టిక్ టాక్ వీడియో తీసి పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Two Youth Arrested For Having Gun--Telugu Trending Latest News Updates Two Youth Arrested For Having Gun--Two Youth Arrested For Having Gun-

దీనితో ఇది పోలీసుల వరకు చేరడం తో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ నగరంలోని మల్‌హర్‌ఘడ్ ప్రాంతానికి చెందిన రాహుల్, కన్హయ్యలిద్దరూ స్నేహితులు.అయితే వీరిద్దరూ కలిసి టిక్ టాక్ వీడియోలు చేసి ఎక్కువమంది నెటిజన్ల కామెంట్లు, లైక్‌లు పొందాలని భావించారు.

దీనిలో భాగంగా తమ స్నేహితుడి వద్ద నుంచి తుపాకీ కూడా తీసుకొని, దానితో బైక్ పై తెగ తిరుగుతూ వీడియో రికార్డ్ చేశారు.బైక్‌‌ను వేగంగా నడుపుతూ, తుపాకీ గురి చూపిస్తూ టిక్ టాక్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం తో ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో హోరెత్తడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి వచ్చింది.టిక్ టాక్ వీడియోను తమ పోలీసుస్టేషను పరిధిలోనే చిత్రీకరించారని తేలడంతో పోలీసులు రాహుల్, కన్హయ్యలను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.

తాము సరదాగా తుపాకీతో బైక్ నడుపుతూ టిక్ టాక్ వీడియో తీస్తే నెటిజనం నుంచి లైక్ లు వస్తాయని భావించి వీడియో తీస్తే, అది కాస్తా తమను ఇబ్బందులోకి నెట్టి తమ జీవితాన్ని నాశనం చేసిందని యువకులు రాహుల్, కన్హయ్యలు లబోదిబోమంటున్నారు.