రోగమేదైనా…ఒక్కటే ట్లాబ్లెట్…ఒక్కసారి వేసుకుంటే నెలంతా పనిచేస్తుంది.  

This One Tablets Make You Healthy For One Month-

నేటికాలంలో జ‌బ్బుప‌డ‌ని వారంటూ ఉండ‌రు.జ‌లుబు నుంచి మొద‌లు కాన్స‌ర్ లాంటి మ‌హామ్మారి వ‌ర‌కు నిత్యం రోగాలతో స‌త‌మ‌తం అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.ఒకే వ్య‌క్తి ఒక్క రోజు జ్వ‌ర‌మ‌ని.ద‌గ్గ‌ని.గుండె జ‌బ్బులు.షుగ‌ర్ వ్యాధి అని ఇలా ఎంత లేద‌న్నా రోజుకు క‌నీసం ఓ 5 నుండి 6 మందుబిల్ల‌లు మింగాల్సిందే.అలా నిత్యం మెడిసిన్ వాడుతున్న వారి సంఖ్య 50% నికి పైనే.మ‌రి అలాంటి వారి క‌ష్టాల‌ను తీర్చేందుకు కొత్త ట్యాబ్లెట్ వ‌స్తే.ఒక్క మందు బిళ్ల నెలంతా ప‌ని చేస్తే.అలాంటి ఓ మందును తీసుకు వ‌చ్చే ప‌నిలో ఉన్నారు వైద్య శాస్త్ర‌వేత్త‌లు.

This One Tablets Make You Healthy For One Month--This One Tablets Make You Healthy For Month-

కుప్ప‌లు కుప్ప‌లుగా మందు గోళీల‌ను క‌డుపులోకి తోయ‌డం కాకుండా కేవ‌లం నెల‌కు ఒక్క మాత్ర‌తోనే రోగాన్ని న‌యం చేసుకోవ‌చ్చని చెపుతున్నారు శాస్తవేత్తలు.

This One Tablets Make You Healthy For One Month--This One Tablets Make You Healthy For Month-

ఒక్క‌సారి వేసుకుంటే మళ్లీ నెల రోజుల పాటు వేసుకోవాల్సిన అవసరం లేని కొత్త క్యాప్సూల్‌ను త‌యారీలో ఉన్నారు మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రైగమ్ ఉమెన్స్ హాస్పిటల్ కు చెందిన వైద్య‌ శాస్త్రవేత్తలు.మాత్ర రూపంలోనే ఉండే ఈ క్యాప్సూల్‌ను ఒక్క‌ సారి వేసుకుంటే చాలు.క‌డుపులోకి వెళ్లిన ఆ మందు టైం ప్ర‌కారం త‌న ప‌నిని తాను శ‌రీరం లోప‌ల ఏరోజుకారోజు కావాల్సినంత మోతాదులో శ‌రీరంలోని వ్యాధికార‌క భాగానికి అందిస్తుంది.

శరీరంలోని పరాన్న జీవుల దుష్ప్రభావాన్ని తగ్గించే ఇవెర్‌మెసిటిన్ అనే ఈ మందును ముందుగా జంతువుల‌పై ప్ర‌యోగించారు.జంతువుల శ‌రీరంలో ఎలా ప‌ని చేస్తుంది ప‌రీక్షించి విజయం సాధించారు.దీంతో మ‌నుషుల‌కు కూడా ఈ మందును అందించేందుకు సిద్ద‌మ‌య్యారు శాస్త్ర‌వేత్త‌లు.ఆకారం పరిమాణంలో సాధారణంగా ఉండే ఈ కొత్త క్యాప్సూల్ ఒకసారి కడుపులోకి చేరగానే నక్షత్రం ఆకారంలోకి మారిపోతుంది.తద్వారా పేగుల్లోకి జారిపోకుండా ఉంటుంది.అంతే కాదు టైం ప్ర‌కారం డోస్ ను విడుద‌ల చేస్తూ రోగి శ‌రీరానికి స‌హ‌క‌రిస్తుంది.

ఇలాంటి క్యాప్సూల్‌తో అంటు వ్యాధులకు చికిత్స అందించడం మరింత సులువు అవుతుందని చెపుతున్నారు వైద్య నిపుణులు.అంతే కాదు నిత్యం మందులు వేసుకోవాల్సిన బాధ నుండి రోగికి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డ‌మే కాకుండా.స‌మ‌య భావం వ‌ల‌న మ‌రిచిపోయే వారికి కూడా బాగా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని చెపుతున్నారు శాస్త్ర‌వేత్త‌ సి.

జియోవానీ ట్రావెర్సో.ఈ మెడిసిన్ వ‌ల్ల‌ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయని చెపుతున్నారు.న్యూరోసైకియాట్రిక్ మందులు ఈ కొత్త క్యాప్స‌ుల్ ద్యారా ప్ర‌పంచంలోకి రాబోతున్నాయ‌ని తెలుస్తోంది.సో ఇక మీ మ‌తిమ‌రుపును సైతం ఈ క్యాప్స‌ుల్స్ దూరం చేయ‌డం ఖాయం.