ఈ జైలు గురించి తెలిస్తే దాన్ని మీరు జైలు అన‌రు. స్వ‌ర్గం అంటారు తెలుసా..?

నేరం చేసిన శిక్ష ప‌డిన ఖైదీ ఎవ‌రైనా జైలు శిక్ష అనుభ‌వించాల్సిందే.అయితే జైలు అన‌గానే ఎవ‌రికైనా ముందుగా గుర్తుకు వ‌చ్చేవి.

 This Norwegian Prison Is The Nicest In The World-TeluguStop.com

ఇనుప ఊచ‌ల‌తో ఉండే గ‌దులు, ఎత్త‌యిన గోడ‌లు, రుచీ ప‌చీ లేని ఆహారం, క‌ఠిన కారాగార శిక్ష‌… ఇవే జ్ఞ‌ప్తికి వ‌స్తాయి.కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే జైలు మాత్రం అలా కాదు.

నిజానికి దాన్ని చూస్తే ఎవ‌రూ జైలు అని అన‌రు.ఏదో ఓ దీవిలో ఉండే మంచి హాలిడే స్పాట్ లా ఉంటుంది.

అక్క‌డికి ఖైదీలు వ‌చ్చినా వారు టూరిస్టుల్లానే గ‌డుపుతారు.స‌క‌ల స‌దుపాయాల‌ను హాయిగా అనుభ‌విస్తారు.

ఒక్క మాట‌లో చెప్పాలంటే… అస‌లు అది జైలు కాదు.! మ‌రి దాన్ని ఏ పేరుతో పిల‌వాలో మీరే చ‌దివి తెలుసుకోండి.!

అది నార్వేలోని బాస్టాయ్ జైలు.ఈ జైలు సాధార‌ణ జైలులా ఉండ‌దు.ఎందుకంటే ఇక్క‌డ ఖైదీల‌కు చాలా స్వేచ్ఛ ఉంటుంది.కానీ వారు పారిపోవ‌డానికి వీలుండ‌దు.అయినా అన్ని స‌దుపాయాలు ఉన్నాక ఎవ‌రు అలా చేస్తారు చెప్పండి.ఇంత‌కీ ఈ జైలు విశేషాలేంటంటే… ఈ జైలులో ఖైదీలు పోలీసులెవరూ లేపకుండానే క్రమశిక్షణతో పొద్దునే లేస్తారు.

అందరూ వ్యాయామం చేస్తారు.కొందరు జైల్లోనే ఉన్న జిమ్‌కు వెళతారు.

కసరత్తు చేస్తారు.కండలు పెంచుతారు.

టిఫిన్‌ చేస్తారు.ఆ తర్వాత పక్కనే ఉన్న బీచ్‌కు వెళతారు.

సన్‌బాత్‌ చేస్తారు.కొందరు సముద్రంలో జలకాలాడుతారు.

పైన్‌ చెట్లను నీడన సేదతీరుతారు.ఆ తర్వాత జైలు నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు గాస్తారు.

వ్యవసాయ పనులు చేస్తారు.జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు.

ఎక్కువ వరకు ఖైదీలే తమకిష్టమైన ఆహారం తామే వండుకొని తింటారు.

ఇక ఈ జైల్లో ఇనుప ఊచ‌ల‌తో ఉండే కటకటాల గదులు ఉండవు.

చిన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ గదులు ఉంటాయి.ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు.

మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు.సాయంత్రం బీచ్‌ ఒడ్డున బిచానా వేస్తారు.

ఆనందంగా గడుపుతారు.మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు.

రాత్రి భోజనం చేసి పడుకుంటరు.ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు.

సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్‌ ఆడొచ్చు.జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది.

అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతుల వారీగా చేసుకుంటారు.ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు.

సొంతంగా ఎవరికిష్టమైన బట్టలు వారు కొనుక్కోవచ్చు, వాటిని వేసుకోవచ్చు.

ఇన్ని స‌దుపాయాలు ఉండ‌బ‌ట్టే ఇక్క‌డ ఉండే ఖైదీలు అంత తేలిగ్గా పారిపోర‌ట‌.ఈ క్ర‌మంలోనే జైలు నుంచి విడుద‌ల‌వ‌డానికి 18 నెల‌ల ముందే బ‌య‌ట ఉద్యోగం చేసుకునేందుకు అనుమ‌తినిస్తారు.విడుద‌ల‌య్యాక కూడా ఖైదీల‌కు ఉద్యోగం ఇప్పిస్తారు.

ప్ర‌స్తుతం ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నారు.ఈ జైలుకు రావాలంటే తీవ్ర‌మైన నేరాల‌కు చేసిన వారికి అనుమ‌తి లేదు.

వేరే ఇత‌ర సాధారణ నేరాలు చేసిన వారు ఒక ఏడాది పాటు వేరే జైల్లో ఉంటే అప్పుడు ఈ జైలుకు వ‌చ్చేందుకు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవ‌చ్చు.ఖైదీల‌లో స‌త్ప్ర‌వ‌ర్త‌న తెచ్చి వారికి ఉపాధి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ జైలు ప‌నిచేస్తుంది.ఇందులో ఉండే ఖైదీలకు అందే స‌దుపాయాలు తెలిస్తే ఎవ‌రికైనా నేరం చేసి జైలుకు వెళ్లాలనిపిస్తుంది.కానీ… అలా చేయ‌డానికి కుద‌ర‌దు.ఎందుకంటే రెండో సారి నేరం చేసి ఈ జైలుకు రావాల‌నుకుంటే వీలు కాదు.వేరే జైలులో వేస్తారు.! అదీ.మ‌రి.జైలా మ‌జాకా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube