ఇటీవల కాలంలో నూతన వధూవరుల పెళ్లి డ్యాన్సెస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేసిన సంగతి అందరికీ విదితమే.
కాగా, తాజాగా ఓ డిఫరెంట్ పెళ్లి డ్యాన్స్ వీడియో వైరలవుతోంది.పాటకు తగ్గట్లు స్టెప్స్ వేయడమే కాదు.
సదరు వైరల్ వీడియలో వధువు, వరుడు డిఫరెంట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇచ్చారు.అవి చూసి చుట్టు పక్కల వాళ్లు ఆనందపడిపోతున్నారు.
సదరు వైరల్ వీడియోలో వరుడు, వధువు డ్యాన్స్ కొంచెం కామెడిగానూ ఉంది.ఈ వీడియో చూస్తే మీకు నవ్వు కచ్చితంగా వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఆఫ్రికన్ కంట్రీకి చెందిన ఓ అమ్మాయి భారతీయ సంప్రదాయంలో మ్యారేజ్ చేసుకున్నట్లు వీడియోను బట్టి అర్థమవుతుంది.ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత బరాత్ తీసే క్రమంలో బ్యాండ్ బాజా మోగిస్తుండగా పెళ్లి కొడుకు మొదలు డ్యాన్స్ షురూ చేశాడు.
అది చూసి ఇరు కుటుంబాల వారు అనగా వధువు కుటుంబీకులు వరువు కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మ్యారేజ్ అనంతరం రోడ్డుపై వరుడు డ్యాన్స్ చేస్తున్నాడు.పెళ్లి కొడుకు డ్యాన్స్‌ను కొద్దిసేపు చూసిన వధువు హ్యాపీగా ఫీలయింది.ఈ నేపథ్యంలోనే తాను కూడా డ్యాన్స్ చేసేందుకు ముందుకొచ్చింది.
ఇద్దరు కలిసి హ్యాపీగా డ్యాన్స్ చేశారు.ఒకరిని మించి పోయి మరొకరు డ్యాన్స్ చేశారు.అయితే, వధువు వేసిన స్టెప్స్ మాత్రం కొంచెం ఫన్నీగానే ఉన్నాయి.ఆఫ్రికన్ స్టైల్ స్టెప్స్ వేసిందో ఏమో తెలియదు కానీ వధువు డ్యాన్సింగ్ స్టైల్, స్టెప్స్ చూస్తే మాత్రం మీరు నవ్వు ఆపుకోలేరంతే.
ఈ వీడియోను శివమ్ శివమ్ అనే యూజర్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు.అది కాస్త నెట్టింట సందడి చేస్తోంది.వీడియోను నెటిజన్లు లైక్ చేయడంతో పాటు ఇంకా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.వధూవరుల డ్యాన్స్ చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వెరీ ఫన్నీ డ్యాన్సింగ్ ఆఫ్ కపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.