వైరల్‌ : ఆ ఆటోను ఎక్కాలంటే రాసి పెట్టి ఉండాలట, అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?  

this mumbai auto most different look first home system auto in nation - Telugu A Small Auto, Auto, Auto In T.v. And Wash Beshin, Mumbai Satyavan Gite, Satyavan Auto Viral In Social Media,

పుర్రెకో బుద్ది అంటూ పెద్దలు ఊరికే అనలేదు.ఉన్నది కొంతైనా ఉన్నతంగా ఆలోచించే వారు కొద్ది మందే ఉంటారు.

This Mumbai Auto Most Different Look First Home System Auto In Nation

తమకున్న దాంట్లో సర్దుకు పోవాలనుకుంటే అందులోనే స్వర్గంను చూసుకోవచ్చు అని కొందరికి మాత్రమే తెలుసు.

కొందరు ఎంత ఉన్నా కూడా ఏదో వెలితి ఫీలింగ్‌తో ఉంటారు.కాని ముంబయికి చెందిన సత్యావాన్‌ గీతే మాత్రం తనకు ఉన్నదాంట్లో స్వర్గంను ఆవిష్కరించేందుకు ప్రయత్నించాడు.తాను ఒక చిన్న ఆటో డ్రైవర్‌ అయినా కూడా నేడు ముంబయిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు.

అతడు చేసింది చిన్న పనే అయినా కూడా అతడి ఆలోచన తీరుకు సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు.అతడు ఆటోను తీర్చి దిద్దిన తీరుకు అంతా కూడా అవాక్కవుతున్నారు.ఆటో డ్రైవర్‌ అయిన సత్యావాన్‌ గీతే తన ఆటోను రీ డిజైన్‌ చేసిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.అతడి ఆలోచన తీరుకు అంతా అవాక్కవుతున్నారు.

తన ఆటో ఎక్కిన వారికి ఇంట్లో కూర్చున్న ఫీల్‌ కలిగేలా అతడు చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.

ఆటోలో వాష్‌ బేషిన్‌ మరియు టీవీ ఇంకా చాలా రకాల వసతులు పెట్టాడు.వాష్‌ బేషిన్‌ను డిజైన్‌గా అలంకరించడంతో పాటు పూలు డిజైన్స్‌ చేసి ఆటోలో కూర్చున్న వారికి అద్బుతమైన అనుభూతిని కలిగించారు.మొత్తానికి సత్యవాన్‌ గీతే ఆటోలో ఎక్కేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

ఆ ఆటోను ఎక్కాలంటే రాసి పెట్టి ఉండాలంటూ జనాలు అనుకుంటున్నారు.ఇన్ని వసతులు ఉన్నా కూడా తన ఆటో ఎక్కే వారి వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు ఏమీ వసూళ్లు చేయడం లేదు.

మీటరు ప్రకారమే సత్యవాన్‌ చార్జీ తీసుకుంటాడు.సత్యవాన్‌ గీతే ఆటోను ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ ట్వింఖిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

#A Small Auto #Auto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

This Mumbai Auto Most Different Look First Home System Auto In Nation Related Telugu News,Photos/Pics,Images..