ఈ కోతి అద్దంలో త‌న అందాన్ని చూసుకుంటూ ఎంత‌లా మురిసిపోతోందో..

This Monkey Is Staring At The Beauty In The Mirror

కోతుల‌కు మ‌నుషుల‌కు ద‌గ్గ‌రి పోలిక‌లు ఉంటాయ‌ని ఇప్ప‌టికే ఎంద‌రో చెప్పారు.అయితే కొన్నిసార్లు ఈ కోతులు చేసే ప‌నులు చూస్తే నిజ‌మేనేమో అనిపిస్తుంది.

 This Monkey Is Staring At The Beauty In The Mirror-TeluguStop.com

కోతి చేష్ట‌లు మామూలుగా ఉండ‌వు.అవి ఎవ్వ‌రి ఊహ‌కు అంద‌కుండా ఉంటాయి.

అందుకే చిన్న పిల్ల‌లు కూడా ఏదైనా విచిత్ర‌మైన ప‌నులు లేదంటే ప‌నికి రాని ప‌నులు చేస్తే కోతి చేష్ట‌లు అంటూ తిడుతుంటారు.మ‌రి కోతి స్వ‌యంగా చేసే కొన్ని ప‌నుల‌కు సంబంధించిన వార్త‌లు ఎంత‌లా వైర‌ల్ అవుతుంటాయో మ‌నం చూస్తున్నాం.

 This Monkey Is Staring At The Beauty In The Mirror-ఈ కోతి అద్దంలో త‌న అందాన్ని చూసుకుంటూ ఎంత‌లా మురిసిపోతోందో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు కూడా ఓ కోతి చేసిన ప‌ని అంద‌రికీ న‌వ్వులు పూయిస్తోంది.

సోషల్ మీడియా అంటేనే జంతువుల‌కు సంబంధించిన వైర‌ల్ వీడియోల‌కు పెట్టింది పేరు.

ఇప్పుడు కూడా ఓ కోతి త‌న అందాన్ని చూసుకుంటో మురిసిపోతుంది.నిజానికి అందం అనే మాట కేవ‌లం మ‌నుషులు మాత్ర‌మే వాడుతారు.

అందం కోసం ఎంత‌లా ప్ర‌య‌త్నాలు చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక అద్దం ముందు నిల‌బ‌డితే గ‌న‌క ఎంత సేపు అయినా రాబుద్ది కాదు.

ఆహా ఎంత అందంగా ఉన్నావ్ రా అంటూ త‌మ‌లో తాము మురిసిపోతుంటారు.అయితే ఓ కోతి కూడా నేనేం త‌క్కువ‌నా అన్న‌ట్టు అద్దంలో చూసుకుంటోంది.

త‌న‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ బైక్ వ‌ద్ద‌కు వ‌చ్చి అందులో త‌న అందాన్ని చూసుకుంటూ మురిసిపోతోంది.ఆహా ఎంత అందంగా ఉన్నాను అనుకుంటున్న‌ట్టు దాని ముఖ క‌ద‌లిక‌లు ఉండ‌టంతో అచ్చు గుద్దిన‌ట్టు మ‌నుషుల్లాగే అనిపిస్తోంది.ఇలా ఒక‌టికి రెండుసార్లు ఆ కోతి త‌న అందాన్ని చూసుకుంటూ తెగ మురిసిపోతోంది.మొద‌ట అద్దంలో త‌న బొమ్మ‌ను చూసుకుని కోతి ఒక్కసారిగా షాక్ అవడం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.

కానీ ఆ త‌ర్వాత మాత్రం త‌న అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది.ఇదంతా అక్క‌డున్న వారు వీడియో తీశారు.

.

#Bike Mirror #Monkey Mirror #Monkey #Mirror #Monkey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube