వామ్మో.. ఈ 'మాయ' కుక్క క్రేజ్ చూస్తే ఆశ్చర్యపోతారుగా.. !!

సోషల్ మీడియా అనేది బాగా పాపులర్ అయ్యాక ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత జరిగిన కానీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.సెలెబ్రిటీల దగ్గర నుండి, రాజకీయ నాయకుల వరకు అందరు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా అన్నీ రకాల సోషల మీడియా సోర్సెస్ ని ఉపయోగించుకుంటున్నారు .

 Maya Dog Has Making Funny Things On Social Media, Maya, Dog, Viral, Social Media-TeluguStop.com

అయితే ఇప్పుడు మనుషులే కాకుండా ఒక పెంపుడు జంతువుకు కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది తెలుసా.!! ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు 1.9 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు.అలా కొన్ని పెంపుడు జంతువులు చేసిన ఫన్నీ వీడియోలు కొన్నిసార్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

తాజాగా ఇన్స్టాగ్రాంలో ఉన్న @mayapolarbear అనే ఒక పేజీలో చిన్న బొచ్చుకుక్క చేస్తున్న అల్లరి చేష్టలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ కుక్క చేసిన వీడియోల్లో కొన్నిటికి లక్షల్లో వ్యూస్, లైక్స్ కూడా వస్తున్నాయి.

ఆ కుక్క యజమాని దానికి ముద్దుగా మాయా అనే పేరు పెట్టుకున్నాడు.ఆ కుక్క సమోయిద్ జాతికి చెందినది.

ఆ మాయ అనే కుక్క కోసం దాని యజమాని ఇన్‌స్టాగ్రాంలో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు.దీంట్లో మాయా చేసిన అల్లరి వీడియోలను షేర్ చేస్తూ వస్తున్నాడు.

ఆ కుక్క ఐస్ క్రీం తింటున్నప్పుడు తీసిన వీడియో ఒకటి ఇటీవల వైరల్ గా మారింది.అప్పటి నుంచి ఈ మాయకి ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.

మళ్ళీ ఇప్పుడు ఈ కుక్క చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది.మనం ఏదైనా కుక్కకి తినిపిస్తున్నప్పుడు ఆ కుక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అనేదే ఈ వీడియో సారాంశం.

కానీ నిజానికి ఆ కుక్కకి ఎటువంటి ఆహారం తినిపించలేదు.కేవలం ఆహారం పెడుతున్నట్లు ఆ కుక్కని నమ్మించారు.

ఇలా చేస్తున్నారని కుక్కకు తెలిసే వరకు వీడియో తీశారు.ఈ వీడియోకు ‘ఇమాజినరీ ట్రీట్స్’ అనే ట్యాగ్ ‌తో షేర్ చేశారు.

నిజంగానే తనకు ఏదో పెడుతున్నారని ఆ కుక్క భావించింది.దాని యజమాని చేయి నోటి దగ్గర పెట్టిన ప్రతిసారీ ఆహారం కోసం చూస్తూ, వాసన చూసింది.ఇలా దాదాపు 4 సార్లు చెసింది.ఇక ఐదవ సారి మాత్రం దానికి ఏమీ తినిపించట్లేదని అర్థం అయ్యి దాని తల పక్కకు తిప్పుకుంది.ఈ వీడియోలో కుక్క బిహేవియర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.ఇలా చేయడాన్ని ‘ఇమాజినరీ ట్రీట్ ఛాలెంజ్‘ అని పిలుస్తున్నారు.

ఇప్పుడు పెంపుడు జంతువులతో ఈ చాలెంజ్ చేసి పోస్ట్ చేయాలనీ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.మరీ మీ ఇంట్లో కూడా పెంపుడు జంతువులు ఉంటే ఈ ఛాలంజ్ ని స్వీకరించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube