దాచుకున్న డ‌బ్బుతో ...బ్రిడ్జిని నిర్మించాడు...ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించాడు.!

కష్టపడి పనిచేస్తూ కొద్ది కొద్దిగా సొమ్మును దాచుకునే వారు.ఇతరులకు సహాయం చేయగలరా.? అస్సలు చేయలేరు కదా.అలా చేస్తే వారి కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతుంది.ఏవైనా అనుకోని ఖర్చులు వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.దీంతో ఇలాంటి వారు సహాయం చేసేందుకు వెనుకాడుతారు.కానీ ఆ వ్యక్తి మాత్రం అలా కాదు.తాను ఎన్నో రోజుల నుంచి కొద్ది కొద్దిగా పోగు చేసుకున్న సొమ్మును ఊరి కోసం ఇచ్చేశాడు.

 This Man Used All His Savings To Build A Bridge For Villagers-TeluguStop.com

తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఉన్నారని కూడా ఆలోచించకుండా తమ గ్రామం కోసం తాను దాచుకున్న మొత్తాన్ని ఇచ్చేశాడు.దీంతో ఇప్పుడా గ్రామంలో అతను రియల్‌ హీరో అయ్యాడు.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

కర్ణాటకలోని బెల్తన్‌గడీ అనే టౌన్‌లో శిశిల అనే గ్రామం ఉంది.అక్కడ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడి కపిల అనే నదిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.ఆ గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ఆ బ్రిడ్జే కీలకం.దీంతో గ్రామస్తులకు చాలా ఇబ్బంది ఎదురైంది.అంతేకాదు, ఆ గ్రామం నుంచి నిత్యం స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.దీంతో ఆ గ్రామస్తుల ఇబ్బందులను గమనించిన అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ శిశిల (32) తాను గత కొంత కాలంగా పోగు చేసుకున్న సొమ్ము రూ.30వేలతో ఓ బ్రిడ్జిని నిర్మించాడు.అతనికి గ్రామస్తులు కూడా సహకరించారు.

అలా బాలకృష్ణ తాళ్లు, లోహపు రేకులు, చెక్క తదితర వస్తువులతో 35 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు ఉన్న బ్రిడ్జిని నిర్మించాడు.దీంతో ఆ గ్రామస్తుల కష్టాలు పోయాయి.అయితే నిజానికి బాలకృష్ణది చాలా పేద కుటుంబం.అతనిపై 5 మంది కుటుంబ సభ్యులు ఆధార పడ్డారు.ఆ గ్రామంలో చిన్న కిరాణా షాపును నడుపుకునే అతను తాను దాచుకున్న సొమ్మును పూర్తిగా ఉపయోగించి ఆ బ్రిడ్జిని నిర్మించాడు.దీంతో ఇప్పుడతను ఆ గ్రామస్తుల దృష్టిలో హీరో అయ్యాడు.

అయితే ఆ బ్రిడ్జి కూలి చాలా కాలమే అయినా, గ్రామస్తులు ఎన్నో సార్లు పంచాయతీ అధికారులను వేడుకున్నారు.బ్రిడ్జి త్వరగా నిర్మించాలని వినతి చేశారు.

అయినప్పటికీ వారు పట్టించుకోలేదు.దీంతో బాలకృష్ణ తన సొంత డబ్బుతో బ్రిడ్జిని నిర్మింపజేశాడు.

అయితే పంచాయతీ అధికారులు ఆ సొమ్మును ప్రభుత్వంతో మాట్లాడి బాలకృష్ణకు ఇప్పిస్తామని చెప్పారట.మరి అది ఎప్పుడు వస్తుందో.

తెలియదు.ఏది ఏమైనా.

బాలకృష్ణ లాంటి మంచి వ్యక్తులకు అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube