మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా.. 30 ఏళ్ళు కష్టపడి రోడ్డు నిర్మించిన వ్యక్తి !

అతడు ఒక మారుమూల గిరిజన వ్యక్తి. వాళ్ళ ఊరికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు.

 This Man Carves Out Kilometre Long Canal To Irrigate Land-TeluguStop.com

అందుకే అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు.తాను 30 ఏళ్ళు కష్టపడి సొంతంగా రోడ్డు నిర్మించాడు.

అడ్డుగా ఉన్న చెట్లను, కొడకోనలను తొలచి పక్క గ్రామానికి వెళ్లేందుకు 2 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు.అందుకే ఒరిస్సా ప్రభుత్వం అతడిని మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా గా గుర్తించారు.

 This Man Carves Out Kilometre Long Canal To Irrigate Land-మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా.. 30 ఏళ్ళు కష్టపడి రోడ్డు నిర్మించిన వ్యక్తి -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది.తలచుకుంటే రెండు రోజుల్లోనే కోలో మీటర్ల రోడ్డును నిర్మించ వచ్చు.అయితే ఇంత టెక్నాలిజీ పెరిగిన కూడా ఇంకా పక్క గ్రామానికి వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు మార్గం లేక చాలా గ్రామాల ప్రజలు ఇప్పటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే అతడు అందరిలా ఉండాలని అనుకోలేదు.

అందుకే స్వయంగా అతడే తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని నిర్ణయించు కున్నాడు.

Telugu Building Own Roads, Harihar Behara, Mountain Man Of Odisha, Odisha Tribal, This Man Carves Out Kilometre-long Canal To Irrigate Land, Tribal Carved Road, Tribals Of Odisha, Tulubi Village-Latest News - Telugu

ఓడిశాలోని ఒక గిరిజన గ్రామానికి చెందిన హరిహర్ పేరు ఆ దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది.ఎందుకంటే తన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని అతడు 30 సంవత్సరాలుగా కష్ట పడుతూనే ఉన్నాడు.తన సోదరుడి సహాయంతో 2 కిలో మీటర్ల రోడ్డును నిర్మించాడు.

అడ్డుగా ఉన్న చెట్లను, కొండలను తొలచి మరి రోడ్డును నిర్మించాడు.అందుకే అతడిని ఒడిశా ప్రభుత్వం మౌంటెన్ మ్యాన్ ఆఫ్ ఒడిశా అని గుర్తించింది.

Telugu Building Own Roads, Harihar Behara, Mountain Man Of Odisha, Odisha Tribal, This Man Carves Out Kilometre-long Canal To Irrigate Land, Tribal Carved Road, Tribals Of Odisha, Tulubi Village-Latest News - Telugu

దారిలో ఉన్న అన్ని కొండలను తొలగించి రోడ్డు నిర్మించేందుకు అతడికి 30 ఏళ్ళు పట్టింది.అతడు వాళ్ళ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఇన్ని ఏళ్ళు కష్ట పడ్డానని చెబుతున్నాడు.హరిహర్ రోడ్డు నిర్మించిన విషయం తెలుసుకున్న అధికారులు ఆయనను ప్రశంసించారు.ఆ తర్వాత అలంటి రోడ్డు సదుపాయం లేని గ్రామాలకు రోడ్డు నిర్మించేందు కు పూనుకుని పనులను కూడా ప్రారంభించారు.

 ఎంతయినా అతడిని ప్రశంసించి తీరాల్సిందే.

#Tribals Odisha #Harihar Behara #Tulubi #Odisha Tribal #Mountain Odisha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు