ఇవాళ రేపు కొన్ని ఘటనలు చూస్తుంటే మన కండ్లను మనమే నమ్మలేకపోతుంటాం.అదేంటి అలా ఎలా సాధ్యం అనే డౌట్ కూడా వస్తుంది.
ఒకప్పటి తరం పిల్లల కంటే ఇప్పుడు వస్తున్న పిల్లలు చాలా షార్ప్‌గా ఉంటున్నారు.చిన్న వయస్సులోనే అద్భుతాలు కూడా సృష్టిస్తున్నారు.
ఇక ఇలాంటి అద్భుతమైన వీడియోలను వెతికి పట్టుకు రావడంలో సోషల్ మీడియా టాప్ ప్లేస్లోనే ఉంటుంది.ఇక ఇప్పుడు కూడా ఓ చిన్నారి ప్రతిభను చూపించే వీడియో మీకోసం తీసుకొచ్చాం.
అయితే ఈ వీడియో చూసిన తర్వాత వావ్ అనాల్సిందేనేమో.
ఎందుకంటే సరిగ్గా నడవడం కూడా రానటుంవంటి ఓ 6 నెలల చిన్నారి వాటర్ స్కీయింగ్‌లో దుమ్ములేపేసింది.
ఏకంగా పంచ రికార్డును బద్దలు కొట్టేసింది.ఈ బుడ్డోడి ట్యాలెంట్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
వాటర్ స్కీయింగ్ ను కేవలం ఆరు నెలలకే చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు మనోడు.కాగా ఇక్కడ ఓ విషయం ఏంటంటే సరిగ్గా ఈ బుడ్డోడు ఈ రికార్డు నెలకొల్పి ఏడాది అవుతోంది.
ఈ సందర్భంగా తన తండ్రి మరోసారి చిన్నారితో ఎవరి సాయం లేకుండానే వాటర్ స్కీయింగ్ చేయించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కాగా చిన్నారి ట్యాలెంట్‌కు సంబంధించిన వీడియోను ఆ బుడ్డడి తల్లిదండ్రులు కాసే, మిండీ హంఫ్రీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా మరోసారి ఈజీగానే వైరల్ కావడం గమనార్హం.
ఇక మన చిచ్చర పిడుగు పేరు రిచ్ హంఫ్రీస్.యూఎస్ లోని ఉటా రాష్ట్రంలో ఈ చిన్నారి నివాసం ఉంటున్నాడు.అయితే తమకు దగ్గరలోని పావెల్ సరస్సులో ఆ చిన్నారి మొదటిసారి వాటర్ స్కీయింగ్ చేసి ప్ర ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడంటే అతని సమార్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ బుడ్డోడి సాహసాన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి డేరింగ్ అందరికీ ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
.