ఈ లేడీ మహ కిలాడీ.. కట్టుకున్న భర్తనే పాపం.. !  

this lady is great kiladi, bhupalpalli, leady, killed, husband - Telugu Bhupalpalli, Husband, Killed, Leady

ప్రస్తుతం ఉన్న సమాజంలో వైవాహిక జీవితం అంటే యూజ్ అండ్ త్రోగా కొనసాగుతున్నాయి.టూకీగా చెప్పాలంటే తన నీడను తాను నమ్మని మనిషి భార్యనో, భర్తనో నమ్ముతాడు కానీ నేడు ఇలాంటి నమ్మకాలు కూడా గోడమీది రాతల్లా మారాయి.

TeluguStop.com - This Lady Is Great Kiladi

ఎవరి మనస్సు ఎప్పుడు కిరాతకంగా మారుతుందో తెలియని బంధాల మధ్య కుటుంబాలు బ్రతుకుతున్నాయి.అసలు భద్రతలేని సమాజంలో మనుషులు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.ఇకపోతే కట్టుకున్న భర్తనే, కన్న తండ్రితో కలసి హత్యచేసిన ఓ ఉత్తమ ఇల్లాలు చివరికి తన భర్త కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేయడం ఆశ్చర్యకరం.

ఇలా ఆ కేసు దర్యాప్తులో ఉండగా భర్తకు కర్మకాండలు నిర్వహించి దొరికిపోయిన ఉదంతం జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లికి గ్రామానికి చెందిన రమేష్ తాపీ మేస్త్రీ గా పని చేస్తున్నాడు.అతనికి భార్య శారద, కుమారుడు, కుమార్తె ఉన్నారు.కాగా వీరి కుటుంబంలో కొద్ది రోజులుగా కలహాలు మొదలవడంతో, కుటుంబంతో సహా అత్తగారింటికి మకాం మార్చాడు.అక్కడకు వెళ్లిన కొద్ది రోజులకు రమేష్ కనిపించకుండా పోవడంతో ఇతని భార్య భూపాలపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఇక నెల రోజుల తర్వాత చనిపోయిన వారికి జరిపించే కర్మ కాండలను తన భర్త పేరున జరిపించడంతో అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్తులు ఆమెను నిలదీశారు.దీంతో తన భర్తను తానే హత్యచేసినట్లు ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోయింది.

తన తండ్రి సహాయంతో హత్యచేసిన భర్తను అడవిలో పాతి పెట్టినట్లు పోలీసు విచారణలో వెల్లడించింది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

#Killed #Husband #Bhupalpalli #Leady

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు