ఎన్నికల వరాలు : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే !

ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేనందున ఏపీ సర్కార్ ప్రజల మనసులను గెలుచుకునేందుకు అనేక తాయిలాలు ప్రకటిస్తోంది.ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు రూ.756 కోట్లు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది.ఒక్కో ఇంటికి రూ.60వేలు మంజూరు చేయనున్నారు.ఇంటికి రూ.45వేలు, మరుగుదొడ్డికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించారు.1996-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు… రూ.10వేల చొప్పున ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది.ట్రాక్టర్లు, ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

 This Isdecisions Of Ap Cabinet-TeluguStop.com

అలాగే….డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది.ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపుకు ఓకే చెప్పింది.

ఐటీ ప్రోత్సాహకాలు పొడిగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా వర్తింప చేయబోతున్నారు.

రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.క్యాపిటల్ హౌసింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాలని సీఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది.

సీఆర్డీఏ చట్టంలో ఈ మేరకు నిబంధనలు పొందుపరచాలని సీఎం సూచించారు.రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube