కేసీఆర్ కొత్త పార్టీ పై వైసీపీ స్పందన ఇదే !

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ ఎస్ పేరుతో కొత్త జాతీయ పార్టీని ప్రకటించారు.అంతేకాకుండా టిఆర్ఎస్ పార్తీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తూ తీర్మానం చేశారు.

 This Is Ycp's Response To Kcr's New Party Kcr, Brs,t Rs, Telangana Sajjala Rama-TeluguStop.com

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు .అయితే కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీలు రకరకాలుగా స్పందించాయి.కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయడంతో , మిగతా రాజకీయ పార్టీలు దీనిపై స్పందిస్తున్నాయి.కెసిఆర్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే బీజేపీ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని భయము ఆయా ప్రాంతీయ పార్టీల అధి నేతల్లో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే కెసిఆర్ కొత్త పార్టీ ఏర్పాటు విషయమై స్పందించేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
      అయితే తాజాగా ఏపీ అధికార పార్టీ వైసిపి దీనిపై స్పందించింది.

ఈ మేరకు ఆ పార్టీ కీలక నేత , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కెసిఆర్ పార్టీ అంశాన్ని ప్రస్తావించారు ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని , కొత్త పార్టీలు రావడం వల్ల పోటీ పెరిగి తమ ప్రభుత్వ పనితీరును మరింత తెలుగు పరుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు .ప్రజలకు సంబంధించిన విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనని సజ్జల అన్నారు.కొత్త పార్టీల రాకపై తాము ఇప్పుడే ఎటువంటి విశ్లేషణలు చేయమని చెప్పారు.

తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసి పార్టీ కాదు అంటూ సజ్జల క్లారిటీ ఇచ్చారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నామని, ప్రజల్లో తమ పార్టీకి మరింత ఆదరాభిమానాలు పెరిగే విధంగా ప్రజల కోసమే తాము పనిచేస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు.

    పక్క రాష్ట్రాల విషయాలు తాము పట్టించుకోమని తాము ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడడం లేదని , తెలంగాణ నాయకులు మాత్రం అక్కడి విషయాలు వదిలేసి తమ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.తమ పార్టీ, ప్రభుత్వం గురించి తెలంగాణ నేతలు స్పందించిన కారణంగానే తాము కూడా స్పందించినట్లుగా సజ్జల చెప్పారు.   

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube