ఇదెక్కడి దారుణం..3 నెలల పసికందుకు తన పోలికలు లేవని చంపేసిన తల్లి..!

This Is Worse The Mother Who Killed Her 3-month-old Baby Because She Did Not Look Like Her , Nashik , Maharashtra, Polices, Police CCTV Footage, Crime

ఇటీవల కాలంలో దారుణాలు ఒకటికి మించి ఒకటి వెలుగులోకి వచ్చి బతుకుతున్నది మనుషుల మధ్యన, జంతువుల మధ్యన అనే పరిస్థితిలో మానవాళి మనుగడ సాగిస్తోంది.కుటుంబ సభ్యులే దారుణాలకు పాల్పడుతూ, అతికిరాతకంగా హత్యలు చేస్తున్నారు.

 This Is Worse The Mother Who Killed Her 3-month-old Baby Because She Did Not Loo-TeluguStop.com

చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు హత్యలుగా మారుతున్నాయి.ఓ కన్నతల్లి తన మూడు నెలల కూతురుకి తన పోలికలు రాలేదని చంపిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో స్థానికులకు ఆశ్చర్యపరిచింది.

పోలీసులు హత్య కేసులో ఆ చిన్నారి తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట కేసును తప్పు దోవ పట్టిస్తూ సోమవారం సాయంత్రం తమ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని మహిళ ప్రవేశించి తనపై రసాయనం వాడడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని, ఆ సమయంలో తన బిడ్డ గొంతు కోసి పారిపోయిందని తెలిపింది.ఈమెకు సపోర్టుగా ఈమె బంధువులు కూడా వాంగ్మూలం ఇచ్చారు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తే, ఆమె చెప్పే వివరాలు అబద్ధాలు అని తెలియడంతో పాటు, పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించింది.తనకు శిశువు పుట్టిన తర్వాత చుట్టుపక్కల వారు, బంధువులు కూతురి ముఖం తన భర్త ముఖాన్ని పోలి ఉందని చెప్పడంతో ఈ దారుణం చేసినట్లు తెలిపింది.తన అత్తమామలు కూడా తన కూతురు తన భర్త పోలికలతో ఉందని ఎప్పుడు చర్చించుకునే వారని, ఆ విషయం విని తాను కలత చెందానని, మూడు నెలలుగా ఈ విషయం బయట వ్యక్తులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా చర్చించడంతో విసుకు చెంది కోపంతో కూతురిని చంపాలని పోలీసుల ముందు అసలు నిజం బయటపెట్టింది.స్థానికులు నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి చేసిన ఈ పని కంటే మరొక దారుణం ఉండదేమో.

ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి దారుణాలు ఆగవని, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Video : This Is Worse The Mother Who Killed Her 3-month-old Baby Because She Did Not Look Like Her , Nashik , Maharashtra, Polices, Police CCTV Footage, Crime #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube