తన సినిమాలో సమంత వద్దంటే వద్దు అన్న రామ్ చరణ్?     2017-01-13   20:53:38  IST  Raghu V

సమంత – నాగచైతన్యల నిశ్చితార్థం అతి త్వరలో జరగబోతొంది. కుదిరితే ఇదే ఏడాది ఇద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు. మంచి విషయమే కదా, సమంత వ్యక్తిగత జీవితం కొత్త అధ్యాయంలోకి వెళ్ళబోతోంది. కాని సమంత ప్రొఫేషనల్ లైఫ్ మాత్రం డీలా పడిపోతోంది. అగ్రహీరోలెవరు సమంతతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. తెలిసిందేగా, దక్షిణాదిలో పెళ్ళైపోయిన లేదా పెళ్ళి కాబోతున్న హీరోయిన్లకి డిమాండ్ తగ్గుతుందని.

ఇప్పుడు సమంత విషయంలో కూడా అదే జరగబోతోంది అనుకుంటా. తాజా ఉదాహరణ చెప్పాలంటే, రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముందు నుంచే అనుపమని అనుకోలేదు. మొదట రాశీఖన్నాను ఆడిషన్ చేసారు. ఈ సినిమా కోసమని రాశీ తెగ కష్టపడి బరువు తగ్గింది కూడా. అయినా లాభం లేకుండాపోయింది. రాశీని కాదన్నారు.

మరోవైపు, ఇప్పటివరకూ రామ్ చరణ్ – సమంత కలిసి సినిమా చేయలేదు. దాంతో పేయిర్ ఫ్రెష్ గా ఉంటుందని సుకుమార్ సమంత పేరుని పరిశీలిస్తే, రామ్ చరణ్ తన సినిమాలో సమంత వద్దంటే వద్దు అన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇదేమి సమంత మీద నెగెటివ్ అలోచనతో కాదులేండి .. అక్కనేని కుటుంబంలో కోడలు కాబోతున్న అమ్మాయి అంటే చాలారకాల పరిమితులు పెట్టుకోవాల్సి వస్తుందేమో … ఆ కారణంతో మొహమాటం, ఇబ్బంది పడే బదులు, వేరే హీరోయిన్ అయితే బెటర్ అని చరణ్ అన్నాడట. దాంతో సమంతని తీసుకునే అలోచన మానేసాడు సుకుమార్. ఇక ఎలాగో రాశీఖన్నాని వద్దు అనుకున్నారు కాబట్టి అనుపమని ఫిక్స్ చేసేసుకున్నారు.