ఆ కారణంతో ప్రభాస్ బాలివుడ్ పెద్ద సినిమా పోగొట్టుకున్నాడు   This Is Why Prabhas Lost A Karan Johar’s Film     2017-10-26   04:08:59  IST  Raghu V

ప్రభాస్ అంటే ఇప్పుడు కేవలం ఒక తెలుగు హీరో కాదు. ఖాన్ త్రయం తరువాత దేశమంతా స్టార్ గా చూసే తారలేవరైనా ఉన్నారంటే, అది రజినీకాంత్ మరియు ప్రభాస్. అంత పెద్ద లీగ్ లోకి ఎంటర్ అయిపోయాడు ప్రభాస్. బాహుబలి తరువాత ఓ డజను మంది బాలివుడ్ నిర్మాతలు ప్రభాస్ ని డేట్స్ అడిగారు. తమ సినిమాల్లో నటించిమని పదే పదే అడిగారు. కాని ప్రభాస్ తొందరపడలేదు. బాహుబలితో వచ్చిన స్టార్ డం తొందరపాటులో పోగొట్టుకోకూడదు అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. అలాగే తన రేంజ్ కంటే చిన్నగా ఉండే సినిమాలు చేయకూడదు. ప్రభాస్ ప్రస్తుతం నమ్ముతున్న రెండు సూత్రాలు ఇవే.

బాహుబలిని హిందీలో పంపిణి చేసిన కరణ్ జోహార్ కూడా ప్రభాస్ ని తన బ్యానర్ లో ఓ సినిమా చేయమని అడిగాడు. కాని ప్రభాస్ ఆ సినిమా పోగుట్టుకున్నాడటా. దానికి కారణం పారితోషికం. ప్రభాస్ ఏకంగా 20 కోట్లు అడిగాడట. తెలుగులో బాహుబలికి మినిహా, ప్రభాస్ కి ఎప్పుడు అంత ఇవ్వలేదు నిర్మాతలు. సరే బాహుబలి తరువాత మార్కెట్ వేరు కదా అని అనుకున్నా, ఆ మార్కెట్ ఎంతో తెలియదు కదా. సాహో కూడా బాలివుడ్ లో ఆదరగోడితే, అప్పుడు హిందీ జనాలు బాహుబలితో పాటు ప్రభాస్ ని కూడా అభిమానిస్తున్నారు అని అనుకోవచ్చు. అందుకే, ఇప్పుడు 20 కోట్లు ఇవ్వలేను. సాహో హిందీ బిజినెస్ అంచనాలను అందుకుంటే మాత్రం అంత కంటే ఎక్కువ పారితోషికం ఇవ్వడానికైనా సిద్ధం అని సింపుల్ గా చెప్పేశాడట కరణ్.

ప్రభాస్ ఇలా రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పకపోతేనే మంచిది. అసలు సాహో విడుదలై, దాని ఫలితం తెలిసే వరకు నిర్మాతలతో ముచ్చట్లు పెట్టకపోతేనే మంచిది. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయితే 20 కోట్లు ఏం ఖర్మ, 40 కోట్లు అడిగినా ప్రభాస్ ఇంటిముందు క్యూలో నిలిచుంటారు బాలివుడ్ నిర్మాతలు.