టిక్ టాక్ ఇండియా ఉద్యోగులు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే...?!

గత నెలలో భారత్-చైనా భద్రతా బలగాల మధ్య జరిగిన సంఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది భద్రతా సిబ్బందిని కోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో చైనా దేశానికి సంబంధించిన మొత్తం వందకు పైగా యాప్స్ ను భారతదేశ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

 Tiktak, India, China, Helo, Army, Banned,-TeluguStop.com

ఇందులో ప్రధానంగా బాగా ప్రాముఖ్యం చెందిన టిక్ టాక్, హెలో యాప్స్ ను కూడా బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం.

ఇకపోతే ఈ రెండు సంస్థలు చైనా దేశానికి చెందిన బైట్ డ్యాన్స్ సంస్థకు చెందినవి.

అయితే ప్రస్తుతం టిక్ టాక్ ను భారతదేశంలో నిషేధించిన తర్వాత అనేక ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.నిజానికి భారతదేశంలో లాక్ డౌన్ పక్రియ మొదలైన అప్పటినుండి ఈ రెండు అప్లికేషన్లు బాగా ప్రాముఖ్యం చెందాయి.

వాటి వాడకం కూడా ఎక్కువగా జరిగింది.దీని కోసం ఆ సంస్థ అనేక మంది ఉద్యోగులను నియమించుకుంది.

కాకపోతే భారతదేశంలో బైట్ డ్యాన్స్ సంస్థకు ఏకంగా రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.భారతదేశంలో బ్యాన్ విధించడంతో ఈ అప్లికేషన్ కు సంబంధించి కొత్త నియామకాలను ఆపేసింది బైట్ డాన్స్.

అయితే ఇప్పటివరకు పని చేస్తున్న ఉద్యోగులు మాత్రం అలాగే కొనసాగుతున్నారు.అయితే ఇందులో పనిచేసే కొంతమంది మాత్రం బయటికి చెప్పుకోలేక వారి పనిని అలాగే కొనసాగిస్తుండగా, కొంతమంది దేశభక్తి ఉన్నవారు సంస్థ నుండి వారంతట వారే వైదొలిగారు.

ఇక ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను కూడా కాపాడుకోవడానికి బైట్ డాన్స్ సంస్థ ఎప్పటికప్పుడు పర్ఫామెన్స్ రివ్యూలు చేస్తూ వారిలో ధైర్యం నింపుతుంది.ఇకపోతే తాజాగా టిక్ టాక్ మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ సంస్థలు కొనుగోలు కు సుముఖత చూపించడంతో బైట్ డ్యాన్స్ సంస్థ ఉద్యోగులను కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంది.

కాబట్టి ప్రస్తుతం పని చేస్తున్న వారిపై ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు.ఇకపోతే మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు సంగతి పక్కన పెడితే భారత ప్రభుత్వ ఆదేశాలకు తగిన విధంగా నడుచుకోవడం ద్వారా ఇండియాలో డేటా సెంటర్ నెలకొల్పడం వంటి ద్వారా విధించిన బ్యాన్ ఎత్తివేసేలా కృషి చేస్తోంది.

ఇక ఈ సంస్థ నుండి బయటికి వచ్చిన ఉద్యోగులు అత్యధికంగా ‘ బోలో ఇండియా’ షార్ట్ వీడియో అప్లికేషన్ లో చేరడానికి ఆ సంస్థను ఎక్కువగా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube