త‌ల్లిప్రేమ అంటే ఇదేనేమో.. బిడ్డ‌ను కాపాడేందుకు త‌న ప్రాణాలు విడిచిన జింక‌..

ఈ సృష్టిలో త‌ల్లి ప్రేమ‌ను మించింది మ‌రొక‌టి ఉండ‌దేమో అనిపిస్తుంది.బిడ్డ ఆక‌లి తీర్చ‌డంతో పాటు ఏదైనా ఆపద వచ్చిందంటే త‌న ప్రాణాలు అడ్డు వేసైనా స‌రే త‌న బిడ్డ‌ను కాపాడుకుంటుంది.

 This Is What Mother Love Means A Deer Who Gave Up Her Life To Save A Child , Dee-TeluguStop.com

ఇలా త‌ల్లి ప్రేమ‌ను చూపించ‌డంలో మ‌నుషులే కాదండోయ్ జంతువులు కూడా ముందుంటాయి.ఇప్ప‌టికే ఇలా జంతువులు తమ పిల్లలను కాపాడుకునేందుకు సాహ‌సించే వీడియోలు ఎన్నో మ‌నం చూస్తున్నాం.

ఇక ఇప్ప్ఉడు కూడా ఇలాంటి ఓ త‌ల్లి ప్రేమ‌ను తెలియ‌జెప్పే వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ఇది చూస్తే ప్ర‌తి ఒక్క‌రికీ కంట‌త‌డి రాక‌మాన‌దేమో.

ఇక ఈ వీడియో కూడా ఓ జింక త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు ఏకంగా త‌న ప్రాణాల‌నే అడ్డు పెట్ట‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.ఈ వీడియో చూస్తే కొన్ని జింకలు త‌మ‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ చెరువును దాటేందుకు వెళ్తాయి.

అయితే ఇంత‌లో ఓ జింక పిల్ల అనుకోకుండా జింక‌ల మందకు కాస్త దూరంగా జ‌రిగి ప‌క్క‌నుంచి నది దాటుతుంది.ఇక ఒంటరిగా వెళ్తున్న జింక పిల్ల‌ను వేటాడేందుకు మొసళ్ళు వేగంగా రావ‌డం క‌నిపిస్తుంది.

అయితే ఆ మొస‌ళ్లు అలా రావ‌డాన్ని ఆ జింక‌పిల్ల త‌ల్లి గ‌మ‌నిస్తుంది.వెంట‌నే అల‌ర్ట్ అయిపోతుంది.

ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌న బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు ప‌రుగు ప‌రుగున మొసలికి తాను అడ్డంగా వెళ్తుంది.ఇంకేముంది ఆ మొస‌ళ్లు ఆ జింక‌ను ఎరగా చేసుకుని వేటాడుతాయి.

చివ‌ర‌కు త‌న బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఒక కవచంలా ఆ జింక నిలుస్తుంది.ఇక మొస‌ళ్ల బారిన ప‌డ‌కుండా ఆ జింక పిల్ల పారిపోతుంది.

ఇలా త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు ఆ జింక చేసిన సాహసం చూసి అందరూ బాధపడతున్నారు.ఒక త‌ల్లి ప్రేమ‌ను మాత్ర‌మే ఈ సృష్టిలో ఇంకేదీ కొన‌లేద‌ని కామెంట్లు పెడుతున్నారంటే దీనికి ఎంత‌లా క‌నెక్ట్ అయ్యారో తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube