ఎన్నారై ట్యాక్స్‌లపై బడ్జెట్ 2023 నుంచి ఆశించేవి ఇవే..

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) తమ పన్నులను దాఖలు చేయడాన్ని సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది.కొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2023లో కూడా ఎన్నారై ట్యాక్స్‌ టాక్స్ కట్టే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మార్పులు తీసుకురావచ్చు.

 This Is What Is Expected From Budget 2023 On Nri Taxes.. Non-resident Indians, N-TeluguStop.com

ఎన్నారైలు ఎప్పుడు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి, రిటర్న్‌లను ఫైల్ చేయడానికి డిజిటల్ టూల్స్ పూర్తిస్థాయిలో తీసుకొచ్చి అవసరమైన రాతపనిని తగ్గించడం వంటి వాటి గురించి బడ్జెట్ 2023లో నిర్ణయాలు తీసుకోవచ్చు.ఇంకా మరిన్ని అంశాలను ప్రవాసులు ఆశిస్తున్నారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bank, Budget, India, Indians, Nri, Assets, System-Telugu NRI

బడ్జెట్ 2023లో భారతదేశంలో ఉన్న లేదా తిరిగి రావడానికి ప్లాన్ చేసుకున్న ఎన్నారైలకు ప్రభుత్వం కొత్త ప్రోత్సాహకాలు, ప్రయోజనాలను సృష్టించవచ్చు.అంతేకాకుండా, పన్నులను నిలిపివేసే ప్రక్రియను సులభతరం చేసి ఎన్నారైలు భారతదేశంలో తమ ఆస్తిని విక్రయించడాన్ని ప్రభుత్వం మరింత సులభతరం చేయవచ్చు.భారతదేశంలో పెట్టుబడులు పెట్టే లేదా మంచి కారణాల కోసం విరాళం ఇచ్చే ఎన్నారైలకు అదనపు తగ్గింపులు, ఉపశమనం కూడా అందించవచ్చు.

Telugu Bank, Budget, India, Indians, Nri, Assets, System-Telugu NRI

గత కొంతకాలంగా ఎన్నారైలు చట్టపరమైన సమస్యలను నివారించడానికి పన్ను సమ్మతిపై మరింత స్పష్టత కోసం అభ్యర్థిస్తున్నారు.ఈ విషయంలో కూడా బడ్జెట్ 2023 ఏదో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశముంది.ఇకపోతే ఎన్నారైలు అంటే సంవత్సరంలో ఎక్కువ భాగం భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు.అయితే ఇతర దేశాల్లో నివసించినా భారతదేశంలో సంపాదించిన లేదా సంపాదిస్తున్న ఆదాయంపై వారు ఇండియాకి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

జీతం, బ్యాంక్ అకౌంట్ వడ్డీ, భారతదేశంలో ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చే మూలధన లాభాలు వంటి వాటిపై వారు పన్ను చెల్లించుకోక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube