నటినటులు వాడిన లక్షల రూపాయల దుస్తులు ఏం చేస్తారో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో సినిమాలకు, అందులో నటించే నటీనటులకు అంతేకాకుండా ఆ సినిమా దర్శకత్వం అందించే డైరెక్టర్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.ఆ సినిమా సెట్ లో బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన సెట్లు కూడా అంతే ముఖ్యం.

 This Is What Happens To Movie Costumes After Shooting Completed-TeluguStop.com

కానీ వీటన్నిటి కంటే ప్రేక్షకులను ఆకట్టుకునే మరోకట‌ి నటీనటుల మేకప్, వారి కాస్ట్యూమ్స్.మేకప్ విషయంలో పాత్రలకు తగ్గట్టుగా వేయడమే కాకుండా.

తాము ధరించే దుస్తులు కూడా పాత్రకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకునేట‌ట్లుగా ఉంటాయి.

 This Is What Happens To Movie Costumes After Shooting Completed-నటినటులు వాడిన లక్షల రూపాయల దుస్తులు ఏం చేస్తారో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ప్రతి ఒక్క విషయంలో ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సినీ పరిశ్రమలలో.

వారి కాస్ట్యూమ్స్ దుస్తులకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు.అంతే కాకుండా వాటిని లక్షలు పెట్టి వారికి తగ్గట్టుగా తయారు చేయిస్తారు.

ఇక సినిమా మొత్తం పూర్తయ్యాక ఆ దుస్తులను ఏం చేస్తారనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది.వాటిని ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా వరకు హిస్టారికల్ సినిమాలకు సంబంధించిన పాత్రలకు ప్రత్యేకంగా దుస్తులను తయారు చేస్తారు.ఆ దుస్తులతోనే సినిమాలకు మంచి హైప్ రావడమే కాకుండా.వాటిని ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ పాత్రకు తగ్గట్టుగా చేయిస్తారు.ఇక ఈ దుస్తులను సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రీసైక్లింగ్ చేయిస్తారు.కొందరు నిర్మాతలు ఇతర సినిమాల లో వాడటానికి తీసుకుంటారు.కానీ అవే దుస్తులను వాడకుండా.

వాటికి మరింత మార్పులు చేస్తూ ప్రేక్షకులు గుర్తు పట్టకుండా తయారుచేయిస్తారు.

ఇదిలా ఉంటే మరి కొంతమంది నటీనటులు సినిమా పూర్తయిన తర్వాత షూటింగ్ లో వాడిన దుస్తులను తమ పాత్రల గుర్తింపు కోసం తమ ఇంటికి తీసుకెళ్తారు.

మరికొందరు కొన్ని ముఖ్యమైన పాత్రల దుస్తులను వేలం వేసి వచ్చిన ఆదాయంతో స్వచ్ఛంద సేవలకు అందజేస్తారు.

#Reuse #Recycling #Social Services #Costumes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు