ఆరోజు జరిగింది ఇదే... మొదటిసారి ట్రోల్స్ పై స్పందించిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్!

సాధారణంగా సినిమా సెలబ్రిటీల గురించి ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.అయితే కొందరు సెలబ్రిటీలుగా మారిన తర్వాత భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటారు.

 This Is What Happened That Day Attitude Star Chandrahas Responded To Trolls For-TeluguStop.com

మరికొందరు ట్రోలింగ్స్ ద్వారా స్టార్ సెలబ్రెటీలుగా మారిపోతూ ఉంటారు.ఇలా ట్రోల్స్ ద్వారా సెలబ్రెటీలుగా మారిన వారిలో ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ ఒకరు.

ప్రభాకర్ బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈయన భార్య పిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.

Telugu Attitude, Chandrahas, Prabhakar-Movie

ఇక ప్రభాకర్ తన కుమారుడు చంద్రహాస్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇదే విషయాన్ని ఈయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తన కుమారుడిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నానంటూ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చంద్రహాస్ బాగా యాటిట్యూడ్ చూపించడంతో ఒక్కసారిగా ఈయన యాటిట్యూడ్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.దీంతో నెటిజన్స్ భారీగా చంద్రహాస్ ను ట్రోల్ చేశారు.

అయితే ఈ ట్రోలింగ్స్ పై ఇదివరకే ప్రభాకర్ స్పందించారు.తాజాగా ఈయన కుమారుడు చంద్రహాస్ సైతం తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు.

Telugu Attitude, Chandrahas, Prabhakar-Movie

ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ తన గురించి వచ్చిన ట్రోల్స్ విషయంలో తన కుటుంబం మొత్తం ఎంతో బాధపడిందని తెలిపారు.ముఖ్యంగా తన తల్లి బాధపడటంతో తనకు లైట్ తీసుకో అని ధైర్యం చెప్పానని ఈయన తెలిపారు.అయితే ఆ రోజు నేను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు.అన్ని కెమెరాలు ముందు తన తండ్రి ఒక్కసారిగా తనని పొగడడంతో నవ్వు ఆపుకోలేకపోయాను తప్ప ఆరోజు నేనే ఏ తప్పు చేయలేదని అయితే అది చూసిన వారికి నేను యాటిట్యూడ్ చూపిస్తున్నాను అని అనుకున్నారంటూ చంద్రహాస్ మొదటిసారి తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube