ఇదేం విచిత్రం.. అమ్మాయికి రెండు జననాంగాలు..!

సాధారణంగా అమ్మాయి లేదా అబ్బాయి అని వారి శరీరాకృతిని బట్టి ఇట్టే గుర్తు పట్టొచ్చు.ఇందుకు వారి శరీరంలో ఉండే అవయవాలు కారణం.

 This Is Weird Girl Has Two Genitals , America Women, Two Genetials, 18 Years, Vi-TeluguStop.com

అయితే, ఒక అమ్మాయికి రెండు జననంగాలుంటే ఎలా ఉంటుంది ఆలోచించంచండి.అదెంటీ? అదెలా సాధ్యం? అనుకుంటున్నారా? అసలు సాధ్యం కాదని మీరంటే పొరపడినట్లే.అమెరికాకు చెందిన ఓ యువతికి రెండు జననంగాలున్నట్లు వైద్యులు గుర్తించారు.వివరాల్లోకెళితే.అమెరికాకు చెందిన పెయిజ్ డిఎంజే అనే యువతి పుట్టుకతో అమ్మాయి.కాగా, ఆమెకు రెండు జననంగాలున్నట్లు వైద్యులు తెలిపారు.

అదెలా బయటపడిందంటే.పెయిజ్‌కు 18 ఏళ్ల వయసులో ప్రతీ రెండు వారాలకోసారి రుతుస్రవం అవుతుండేది.

అది గమనించిన ఆమె ఇలా పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయని గైనకాలజిస్టును సంప్రదించింది.అప్పుడు సదరు యువతికి వైద్యులు పలు పరీక్షలు చేశారు.

అనంతరం అమ్మాయి శరీరంలో రెండు జననంగాలున్నట్లు తెలిపారు.ఆమె వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు.

పెయిజ్‌ తన శరీరంలో రెండు జననంగాలున్నట్లు 18 ఏళ్ల వరకు గుర్తించలేకపోయింది.ఇకపోతే పెయిజ్ సెక్స్ లైఫ్ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులుండవని వైద్యులు చెప్తున్నారు.

పెయిజ్‌కు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.ఇటీవల పెయిజ్‌కు తల్లికావాలని కోరిక కలగగా మరో మారు వైద్యులను సంప్రదించింది.

వైద్యులు సానుకూలంగా స్పందించారని పెయిజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Telugu America, Doctors, Lady, Netizens, Paige Dmj, Genetials-Latest News - Telu

అలా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇక తనకు సంతానం కలుగుతుందని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆమెకు నెటిజన్లు సూచిస్తున్నారు.ఒక మహిళ ఐదుసార్లు గర్భస్రావం తర్వాత కూడా తల్లి అయిందని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.

ఈ క్రమంలో రెండు జననంగాలున్నంత మాత్రాన సంతానం కలగరని దిగులు పడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నాడు.మొత్తంగా పెయిజ్ డిఎంజెకు నెటిజన్ల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ లభిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube