ఇదేం స‌ర‌దారా బాబు... ఇత‌ను దేనితో స్నానం చేస్తున్నాడో చూస్తే..

This Is Time Pass If You See What He Is Bathing With

అసలే చలికాలం ఈ సమయంలో చన్నీళ్ల స్నానం ఎవరికైనా సరే వణుకు పుడుతుంది.కానీ స్నానం చేయక తప్పదు కాబట్టే మనం ఇళ్లల్లో ఉన్నపుడు హీటర్లు, గీజర్లను ఉపయోగించి నీటిని వేడి చేసుకుని స్నానం చేస్తాం.

 This Is Time Pass If You See What He Is Bathing With-TeluguStop.com

ఇంట్లో అంటే వేడి నీటితో స్నానం చేయడం వీలవుతుంది.కానీ అదే మనం ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ కేవలం సరస్సులు, నదులు మాత్రమే ఉంటే ఆ సమయంలో వేడి నీటిని చేయడమెలాగో చాలా మందికి తెలియదు.

అందుకోసమే కష్టమైనా సరే చన్నీళ్లతోనే స్నానం కానిచ్చేస్తారు.కానీ సరస్సులు, కొలనుల్లో చలికాలం పూట చన్నీళ్లతో ఎలా స్నానం చేయాలో ఓ యూజర్ చూపించాడు.

 This Is Time Pass If You See What He Is Bathing With-ఇదేం స‌ర‌దారా బాబు… ఇత‌ను దేనితో స్నానం చేస్తున్నాడో చూస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతడు చన్నీళ్ల స్నానం చేసే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది వైరల్ గా మారింది.

ఇంతకీ అతడు స్నానం చేసేందుకు ఏం ఉపయోగించాడంటే.ఎవరికైనా సరే చలికాలం పూట చన్నీళ్ల స్నానం చేయడం కష్టంతో కూడుకున్న పనే.కానీ ఎటువంటి కష్టం అవసరం లేకుండా చలికాలంలో కూడా చన్నీళ్ల స్నానం ఎలా చేయొచ్చో ఓ యూజర్ చూపించాడు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ యూజర్ నదిలో స్నానం చేసే సమయంలో అతడి పక్కన ఓ గమేళాలో గడ్డితో మంటను వెలిగించాడు.ఓ సారి నదిలోకి మునిగి చలి మంట కోసం గమేళాలో వెలుగుతున్న నిప్పును ఉపయోగించుకున్నాడు.

మరో సారి కూడా అతడు అలాగే చేశాడు.ఇలాగే చేస్తూ తను స్నానాన్ని పూర్తి చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అనేక రకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మీరూ ఈ వైరల్ వీడియోను చూసేయండి.ఏమనిపించిందో కామెంట్ చేయండి.

ఈ ఐడియా మీకూ వర్కౌట్ అవుతుందేమో చూడండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube