అమెరికా చరిత్రలో చెత్త రికార్డ్...

అమెరికా చరిత్రలో ఇదొక చెత్త రికార్డు గా పరిగణిస్తున్నారు పరిశీలకులు.అంతే కాదు అప్పట్లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రికార్డ్ ని ఇప్పుడు ట్రంప్ చేధించారని సోషల్ మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు.

 This Is The Worst Record In The World About Trump-TeluguStop.com

ఇంతకీ ట్రంప్ సాధించిన ఆ ఘనత ఏమిటి.?? ఏమిటా రికార్డ్ అనే వివరాలలోకి వెళ్తే.

మెక్సికో గోడని నిర్మించడానికి ట్రంప్ చేయని ప్రయత్నం లేదు ఈ కారణంగా గత కొన్ని రోజులుగా అమెరికా మొత్తం షట్ డౌన్ లో ఉండిపోయింది దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ట్రంప్ నిధులు సమకూర్చేందుకు అత్యవసర పరిస్థితిని విధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే ఈ గోడ గొడవ కారణంగా దాదాపు 22 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతూనే ఉంది.అమెరికా చరిత్రలోనే ఇది రికార్డ్ అంటున్నారు.గతంలో బిల్ క్లింటన్ సమయంలో 21 రోజులు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కున్నారు అమెరికా ప్రజలు మళ్ళీ దాదాపు ఇన్నేళ్ళ తరువాత ఇటువంటి పరిస్థితి ఎదురవడం నిజంగా ఎంతో దారుణం అంటున్నారు రాజకీయ వేత్తలు.అయితే ట్రంప్ కి డెమొక్రాట్స్ కి మధ్య సయోధ్య కుదరటంలేదు కాబట్టి దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తే ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్ళపై ఆయన ఆరా తీశారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube