అది అత్యంత ర‌హ‌స్య స‌ర‌స్సు.. దానిలోని నీరు తాగగానే...

ప్రపంచం అంతా అసంఖ్యాకమైన రహస్యాలతో నిండి ఉంది.ఇప్పటి వరకు మనిషి చాలా రహస్యాల గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాడు.

 This Is The Worlds Most Mysterious Lake  Mysterious Lake, South Africa , Lake  ,-TeluguStop.com

ఇప్పుడు మనం ఒక‌ సరస్సుకి సంబంధించిన రహస్యం గురించి తెలుసుకుందాం.ఈ రహస్యాన్ని నేటికీ ఎవ‌రూ ఛేదించ‌లేక‌పోయారు.

అదే దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌లో ఉన్న ప్రమాదకరమైన సరస్సు.దీనిని ఫండూజీ సరస్సు అని పిలుస్తారు.

ఈ సరస్సు నీటిని తాగిన వ్యక్తి ఇక మనుగడ సాగించడని చెబుతారు.ఎలాగోలా బతికినా కొద్ది సేప‌టికే చనిపోతాడ‌ట‌.

స్థానికులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.పురాతన కాలంలో ఈ దారిలో వెళుతున్న ఒక కుష్ఠురోగికి ఇక్కడి ప్రజలు ఆహారం, బస ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు.

దీంతో అతను ఆ ప్రాంతం ప్రజలను శపించాడంటారు.ఇప్ప‌టికీ అత‌ని అరుపులు ఇక్క‌డ వినిపిస్తాయ‌ట‌.

అత‌ను ఆ సరస్సులోకి ప్రవేశించి అదృశ్యమయ్యాడ‌ట‌.సరస్సు లోపల నుండి తెల్లవారుజామున డ్రమ్ముక‌ట్టిన‌ శబ్దాలు వస్తాయని చెబుతారు.

దీంతో పాటు జంతువులు, మనుషుల అరుపులు కూడా వినిపిస్తుంటాయ‌ట‌.ఈ సరస్సును పర్వతాలపై నివసించే భారీ డ్రాగన్‌ రక్షింస్తుంద‌ని స్థానికుల‌లో ఒక‌ నమ్మకం కూడా ఉంది.

ఆ కుష్టురోగిని సంతోషపెట్టడానికి ప్రతి సంవత్సరం గిరిజ‌నులు ఒక నృత్య ఉత్సవాన్ని నిర్వహిస్తారు.ఇందులో పెళ్లికాని అమ్మాయిలు నృత్యం చేస్తారు.పురాతన కాలంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ముతాలి నది ప్రవాహానికి అడ్డుపడటం వల్ల ఈ సరస్సు ఏర్పడి ఉండవచ్చని చెబుతారు ఈ సరస్సు నీరు శుభ్రంగా ఉన్నప్పటికీ తాగిన వ్యక్తి ఎందుకు చనిపోతాడనేది ఇప్పుడు మిస్టరీగా మిగిలిపోయింది.ఈ సరస్సు నీటి రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలాసార్లు శాస్త్ర‌వేత్త‌లు ప్రయత్నించారు.కానీ ప్రతిసారీ వారు విఫలమయ్యారు.1946లో ఆండీ లెవిన్ అనే వ్యక్తికి ఈ సరస్సులోని ర‌హ‌స్యం తెలిసిందని చెబుతారు.అక్కడి నుంచి అత‌ను నీరు, కొన్ని మొక్కలు తీసుకుని వెళ్లాడు.ప‌రిశోధ‌న‌ల కోసం చాలా సార్లు ఇలా చేశాడు.ఒక్కసారి దారి త‌ప్పాడు.వారం రోజుల తర్వాత మరణించాడు.

నేటికీ ఈ సరస్సులోని నీరు ప్రజలకు మిస్టరీగా మిగిలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube