వైరల్: ప్రపంచంలో అతి పురాతన పెయింటింగ్ ఇదేనట..!

తాజాగా కొందరు ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పెయింటింగ్ కనుగొన్నట్లు తెలియజేస్తున్నారు.గుహలోని పెయింటింగ్ ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోనే అత్యంత పురాతన పెయింటింగ్ గా పేర్కొంటున్నారు.

 World, Oldest Painting, Viral, Indonesia, Indinashia,i Land,archalagists,small C-TeluguStop.com

ఈ పెయింటింగ్ ను 45,500 సంవత్సరాల కిందట వేసిన అడవి పంది పెయింటింగ్ అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.ఈ పెయింటింగ్ ఇండోనేషియా లోనీ ఓ పురాతన గుహలో కనుగొనట్లు వారు తెలిపారు.

ఈ ప్రాంతంలోని పరిస్థితులు తొలి మానవ మనుగడ ఎప్పుడు మొదలైంది అన్న విషయాన్ని గుర్తించడానికి అనేక పరిశోధనలు చేస్తున్న ఆర్కియాలజిస్ట్ తెలిపారు.

ఇండోనేషియా దేశానికి సంబంధించిన అత్యంత వెనుకబడిన ప్రాంతం అయిన ఓ ఐలాండ్ లో ఉన్న ఓ గుహలో ఈ పెయింటింగ్ కనుగొన్నట్లు తెలిపారు.

అయితే ఇక్కడికి వెళ్లాలంటే ఎలాంటి రోడ్డు రవాణా ఉండదు.రోడ్డు రవాణా ఉన్న వరకు వెళ్లి అక్కడి నుంచి దాదాపు కొన్ని గంటల పాటు నడిచి వెళితే తప్ప ఆ గుహకు మనుషులు చేరుకోలేరు.

అది కూడా కేవలం వేసవికాలం లోనే ఈ గుహకు చేరుకోగలరు.దీనికి కారణం మిగతా సమయాలలో ఆ దట్టమైన ప్రాంతంలో విపరీతమైన నీటి ప్రవాహం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ఇక ఈ పెయింటింగ్ సంబంధించిన విషయాలు చూస్తే.ఇది 136 సెంటీమీటర్ల వెడల్పు, 54 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది.

ఈ పెయింటింగ్ లో అడవి పందిని వేసినట్లు కనపడుతోంది.

Telugu Indonesia, Oldest-Latest News - Telugu

ఈ అడవి పంది ముదురు ఎరుపు రంగు తో వేసినట్లు కనబడుతోంది.ఈ పెయింటింగ్ వేసిన వారి చేతి ముద్రలు సైతం అక్కడ కనపడుతున్నాయి.ఈ పెయింటింగ్ తో పాటు మరో రెండు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అవి పాక్షికంగానే కనిపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ పెయింటింగ్ యురేనియం సిరీస్​ ఇస్టోప్ డేటింగ్​ సహాయంతో 45 వేల సంవత్సరాల కిందట అని తెలియజేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube