ఇదేం తీర్పు...న్యాయస్థానంపై బిడెన్ అసహనం...!!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన సంఘటన సంచలన సృష్టిస్తోంది.న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండేలా తీర్పులు ఉండాలంటూ బిడెన్ వ్యక్త పరిచిన విధానం అందరిని షాక్ కు గురిచేసింది.

 This Is The Verdict Biden Is Impatient With The Court ,  Biden, Ritten Hauj , Wh-TeluguStop.com

అయితే ఈ ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ముందుగానే గ్రహించిన బిడెన్ అందుకు తగ్గట్టుగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు.ఇంతకీ బిడెన్ ఎందుకు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్ట.

అమెరికాలో 2020 ఆగస్టు 25 తేదీన రిట్టెన్ హౌజ్ అనే వ్యక్తి కినోషాలో తుపాకి తో కాల్పులు జరిపాడు.తన చేతిలో ఉన్న తుపాకి తీసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అప్పటి నుంచీ ఈ కేసుపై విచారణలు జరుగుతూనే ఉంది.

అయితే తాజాగా ఈ కేసు రెండు రోజుల క్రితం విచారణకు రాగా స్థానిక కోర్టు ఇద్దరిని హత్య చేసి ఒకరిని గాయపరిచిన రిట్టెన్ హౌజ్ నిర్దోషి అంటూ కేసు కొట్టేసింది. ఈ ఘటన అందరిని ఒక్కసరిగా షాక్ కి గురిచేసింది.

అయితే రిట్టెన్ హౌజ్ కేవలం తనను తాను ఆత్మ రక్షణ నుంచీ కాపాడుకునేందుకు కాల్పులు జరిపాడు కానీ అతడికి ఎలాంటి హత్య చేయాలనీ లేదని అతడి లాయర్ వాదించాడు.రిట్టెన్ హౌజ్ సైతం కోర్టు ముందు ఇదే చెప్పడంతో న్యాయమూర్తి అన్ని సాక్ష్యాలని పరిశీలించిన తరువాత అతడు నిర్దోషని తేల్చింది.

అసలు ఆ సమయంలో ఏం జరిగింది.

రిట్టెన్ హౌజ్ చేసిన జాత్యహంకార హత్య కాదు ఎందుకంటే రిట్టెన్ హౌజ్ ఒక శ్వేత జాతీయుడు అలాగే చనిపోయిన ఇద్దరు కూడా శ్వేత జాతీయులే కానీ ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు ఓ నల్లజాతీయుడు హత్యకు గురవ్వడంతో అల్లాలు జరిగాయి.

ఈ క్రమంలో అదే సమయంలో అతడిమీడకు దాడి చేయడానికి వస్తున్నారనుకుని ఆత్మ రక్షణ కోసం అలా చేశాడని న్యాయస్థానం తీర్పు చెప్పింది.అయితే ఈ న్యాయస్థానం తీర్పు చెప్పే ముందుగానే బిడెన్ రిట్టెన్ హౌజ్ ఉద్దేశిస్తూ ఈ హత్యలు శ్వేత జాత్యహంకారానికి నిదర్శనమని ట్వీట్ చేశారు.

కోర్టు తీర్పు తరువాత కోర్టు తీర్పుకి అందరూ కట్టుబడి ఉండాలంటూ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube